గుట్టు చేకొందువుగాక కోమలితోను
(॥పల్లవి॥)
గుట్టు చేకొందువుగాక కోమలితోను
పట్టి పెనఁగఁగఁబోతే పంతమెక్కీ సుమ్మీ
(॥గుట్టు॥)
చెక్కులనే నీడ చూచి సిగ్గుల నీరెండ గానె
చిక్కుదీసీ నీనెరులు చెలియ
మొక్కీఁ దనకాలు దాఁకి మోసమున నంటాను
వక్కణ లడుగఁబోతే వాదువచ్చీ సుమ్మీ
(॥గుట్టు॥)
కన్నుల నివాళ్లిచ్చి కాఁకలనే చొప్పులెత్తి
చన్నులఁ గానుక చూపీ జలజాక్షి
మన్ననల వేఁడుకొని మాటదప్పి వచ్చెనంటా
సన్నలు సేయఁగఁబోతే చలమెక్కీ సుమ్మీ
(॥గుట్టు॥)
మోవినే విందుచెప్పి మోహమున విడెమిచ్చి
కైవసమై నినుఁ గూడె కలికి
శ్రీ వేంకటేశ్వర నవ్వి చేఁతసేసితి నిన్నంటా
వావాతఁ గొసరఁబోతే వాసులెక్కీ సుమ్మీ
(||pallavi||)
guṭṭu segŏṁduvugāga komalidonu
paṭṭi pĕnam̐gam̐gam̐bode paṁtamĕkkī summī
(||guṭṭu||)
sĕkkulane nīḍa sūsi siggula nīrĕṁḍa gānĕ
sikkudīsī nīnĕrulu sĕliya
mŏkkīm̐ danagālu dām̐ki mosamuna naṁṭānu
vakkaṇa laḍugam̐bode vāduvachchī summī
(||guṭṭu||)
kannula nivāḽlichchi kām̐kalane sŏppulĕtti
sannulam̐ gānuga sūbī jalajākṣhi
mannanala vem̐ḍugŏni māḍadappi vachchĕnaṁṭā
sannalu seyam̐gam̐bode salamĕkkī summī
(||guṭṭu||)
movine viṁdusĕppi mohamuna viḍĕmichchi
kaivasamai ninum̐ gūḍĕ kaligi
śhrī veṁkaḍeśhvara navvi sem̐tasesidi ninnaṁṭā
vāvādam̐ gŏsaram̐bode vāsulĕkkī summī