గుట్టు మాతోఁ జేసేవుగా కొండలరాయా
(॥పల్లవి॥)
గుట్టు మాతోఁ జేసేవుగా కొండలరాయా
వట్టిజోలి యిఁక నేల వద్దు కొండలరాయా
(॥గుట్టు॥)
కొమ్మదిక్కు చూడరాదా కొండలరాయా, నీపైఁ
గుమ్మరించీ వలపులు కొండలరాయా
కుమ్మెలాయె గోరితాఁకు కొండలరాయా
నమ్మిక లిచ్చితివిగా నా డే కొండలరాయా
(॥గుట్టు॥)
కుప్పెసవర మేడది కొండలరాయా, కడుఁ
గుప్పళించకు సిగ్గులు కొండలరాయా
కొప్పువంచి ఇంతి మొక్కె కొండలరాయా
అప్పటి నూరకున్నాఁడవయ్యా కొండలరాయా
(॥గుట్టు॥)
గోడమీఁదిసున్న మైతి కొండలరాయా
కోడెవయసు వో నీకు కొండలరాయా
కూడితివి మా సతిని కొండలరాయా
మేడెపు శ్రీవేంకటేశ మేలు కొండలరాయా
(||pallavi||)
guṭṭu mādom̐ jesevugā kŏṁḍalarāyā
vaṭṭijoli yim̐ka nela vaddu kŏṁḍalarāyā
(||guṭṭu||)
kŏmmadikku sūḍarādā kŏṁḍalarāyā, nībaim̐
gummariṁchī valabulu kŏṁḍalarāyā
kummĕlāyĕ goridām̐ku kŏṁḍalarāyā
nammiga lichchidivigā nā ḍe kŏṁḍalarāyā
(||guṭṭu||)
kuppĕsavara meḍadi kŏṁḍalarāyā, kaḍum̐
guppaḽiṁchagu siggulu kŏṁḍalarāyā
kŏppuvaṁchi iṁti mŏkkĕ kŏṁḍalarāyā
appaḍi nūragunnām̐ḍavayyā kŏṁḍalarāyā
(||guṭṭu||)
goḍamīm̐disunna maidi kŏṁḍalarāyā
koḍĕvayasu vo nīgu kŏṁḍalarāyā
kūḍidivi mā sadini kŏṁḍalarāyā
meḍĕbu śhrīveṁkaḍeśha melu kŏṁḍalarāyā