Guttu gomta valadaa komalulagu

గుట్టు గొంత వలదా కోమలులకు
Language

(॥పల్లవి॥)
గుట్టు గొంత వలదా కోమలులకు
ముట్టుమీరి వలపులు రట్టుసేయ నేఁటికి

(॥గుట్టు॥)
చక్కఁబెట్టుకోవే కొప్పు జాణతనా లేమాడేవు
ఇక్కడఁబతి ముందర నేఁకారుకొంటా
పక్కనఁ జన్నుల మీఁది పయ్యద గప్పుకోఁగదే
నెక్కొన నిందరిలోన నివ్వెరగు లేఁటికి

(॥గుట్టు॥)
తుడుచుకోవే చెమట తొంగి యేమి చూచేవు
వుడివోని తమి నువ్విళ్ళూరుకొంటా
వెడవెడగాఁ బోఁకముడి వీడెఁ గట్టుకోవే
అడియాసలనే పరాకయ్యే వదేఁటికి

(॥గుట్టు॥)
సరులు దిద్దుకోవే సన్నల నేమి మొక్కేవు
పెరరేఁచి తమకము పేరించుకొంటా
యిరవై శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్నుఁ గూడె
తరి నీవూఁ బెండ్లాడవే తలపోఁత లేఁటివి

(||pallavi||)
guṭṭu gŏṁta valadā komalulagu
muṭṭumīri valabulu raṭṭuseya nem̐ṭigi

(||guṭṭu||)
sakkam̐bĕṭṭugove kŏppu jāṇadanā lemāḍevu
ikkaḍam̐badi muṁdara nem̐kārugŏṁṭā
pakkanam̐ jannula mīm̐di payyada gappugom̐gade
nĕkkŏna niṁdarilona nivvĕragu lem̐ṭigi

(||guṭṭu||)
tuḍusugove sĕmaḍa tŏṁgi yemi sūsevu
vuḍivoni tami nuvviḽḽūrugŏṁṭā
vĕḍavĕḍagām̐ bom̐kamuḍi vīḍĕm̐ gaṭṭugove
aḍiyāsalane parāgayye vadem̐ṭigi

(||guṭṭu||)
sarulu diddugove sannala nemi mŏkkevu
pĕrarem̐si tamagamu periṁchugŏṁṭā
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannum̐ gūḍĕ
tari nīvūm̐ bĕṁḍlāḍave talabom̐ta lem̐ṭivi