Guttu gomta rattu gomtam guligeem gade

గుట్టు గొంత రట్టు గొంతఁ గులికీఁ గదే
Language

(॥పల్లవి॥)
గుట్టు గొంత రట్టు గొంతఁ గులికీఁ గదే
చుట్టిమువలెనే యీ చొక్కనాథుఁడు

(॥గుట్టు॥)
జగడాలమాటలు చల్లఁ జూపుతేటలూ
నగుతానే యీరెండు నడపెఁ గదే
మొగమోట సిగ్గులు ముచ్చటల యెగ్గులు
సొగటులు మానఁ డిదె చొక్కనాథుఁడు

(॥గుట్టు॥)
పనిలేని పంతము పైకొంటే పంతమూ
నినుపుల యివి రెండు నెరపెఁ గదే
తనివోని యాసలు తబ్బిబ్బుల బాసలు
చొనిపీ నూరకె నాతో చొక్కనాథుఁడు

(॥గుట్టు॥)
పానుపుపై జోడులు పలురతివాడులు
నానాఁట యివి రెండు నడపీ గదే
పూనిన శ్రీవెంకటాద్రినుండి వచ్చి ననుఁ గూడె
సూనాస్త్రగురుఁడైన చొక్కనాథుఁడు

(||pallavi||)
guṭṭu gŏṁta raṭṭu gŏṁtam̐ guligīm̐ gade
suṭṭimuvalĕne yī sŏkkanāthum̐ḍu

(||guṭṭu||)
jagaḍālamāḍalu sallam̐ jūbudeḍalū
nagudāne yīrĕṁḍu naḍabĕm̐ gade
mŏgamoḍa siggulu muchchaḍala yĕggulu
sŏgaḍulu mānam̐ ḍidĕ sŏkkanāthum̐ḍu

(||guṭṭu||)
panileni paṁtamu paigŏṁṭe paṁtamū
ninubula yivi rĕṁḍu nĕrabĕm̐ gade
tanivoni yāsalu tabbibbula bāsalu
sŏnibī nūragĕ nādo sŏkkanāthum̐ḍu

(||guṭṭu||)
pānububai joḍulu paluradivāḍulu
nānām̐ṭa yivi rĕṁḍu naḍabī gade
pūnina śhrīvĕṁkaḍādrinuṁḍi vachchi nanum̐ gūḍĕ
sūnāstragurum̐ḍaina sŏkkanāthum̐ḍu