Guṟudulellaam gamtimi guttu seya nimkanela

గుఱుతులెల్లాఁ గంటిమి గుట్టు సేయ నిఁకనేల
Language

(॥పల్లవి॥)
గుఱుతులెల్లాఁ గంటిమి గుట్టు సేయ నిఁకనేల
మఱఁగులు వెట్టకిఁక మాతోఁ జెప్పవయ్యా

(॥గుఱు॥)
చెలియ ముడుచుకొన్న చెంగలువ పువ్వులు
యెలమి నీకొప్పలోని కేల వచ్చెను
పొలుపుగాఁ జన్నులపై బూసిన గందము నీమై
వెలయఁగ నంటుకొన్న విధ మానతీవయా

(॥గుఱు॥)
ఆకాంత గట్టుకొన్న యట్టి చంద్రగా(కా?) వి చీర
నీకు దట్టియైనట్టి నెప మేఁటిది
మేనొని యాపెపాదాల మించులును మెట్టెలును
యీకాడ నీవేళ్లనున్న దిదేమి చెప్పవయా

(॥గుఱు॥)
సుదతి చెవిలోనున్న సొంపైన తట్టుపుణుఁగు
చెదరి నీపచ్చడానఁ జెందియున్నది
అదన శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
పొదలీ మోము కళలు బొంకక చెప్పవయా

(||pallavi||)
guṟudulĕllām̐ gaṁṭimi guṭṭu seya nim̐kanela
maṟam̐gulu vĕṭṭagim̐ka mādom̐ jĕppavayyā

(||guṟu||)
sĕliya muḍusugŏnna sĕṁgaluva puvvulu
yĕlami nīgŏppaloni kela vachchĕnu
pŏlubugām̐ jannulabai būsina gaṁdamu nīmai
vĕlayam̐ga naṁṭugŏnna vidha mānadīvayā

(||guṟu||)
āgāṁta gaṭṭugŏnna yaṭṭi saṁdragā(kā?) vi sīra
nīgu daṭṭiyainaṭṭi nĕba mem̐ṭidi
menŏni yābĕbādāla miṁchulunu mĕṭṭĕlunu
yīgāḍa nīveḽlanunna didemi sĕppavayā

(||guṟu||)
sudadi sĕvilonunna sŏṁpaina taṭṭubuṇum̐gu
sĕdari nībachchaḍānam̐ jĕṁdiyunnadi
adana śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
pŏdalī momu kaḽalu bŏṁkaga sĕppavayā