Guṟigaa shree krshnumdu managu dora dooruvaamdu

గుఱిగా శ్రీ కృష్ణుఁడు మనకు దొర దూరువాఁడు
Language

(॥పల్లవి॥)
గుఱిగా శ్రీ కృష్ణుఁడు మనకు దొర దూరువాఁడు
వెఱవక చేతికొద్ది వెఱఁజరో మీరు

(॥॥)
పెట్టిరి గొల్లెతలెల్ల పెరుగు నెయ్యి వుట్ల
కొట్టరో కొట్టరో మీరు కోలలవారు
తిట్టేరు వారిల్లదివో తెగి దగ్గరకతొల్లె
పట్టరో వారలు మీరు పైఁగారేపాలు

(॥॥)
యెంచి పెట్టిరి దొంతుల నేడలేనిచక్కిలాలు
దించరో కుండలతోనే దిగువకును
పెంచులయినదాఁకా పెనఁగేరు మనతోడ
తుంచి నోరవేసుకొని తొలఁగరో మీరు

(॥॥)
తక్కక యడుకులెల్లా దాఁచిరి తమసొమ్మంటా
చిక్కెఁ జిక్కెఁ దీసుకోరో నేన వున్నవి
యెక్కెను శ్రీ వేంకటాద్రి ఇదివో మనకృష్ణుఁడు
చక్కనాయఁ బనులెల్లాఁ జాలించి రారో

(||pallavi||)
guṟigā śhrī kṛṣhṇum̐ḍu managu dŏra dūruvām̐ḍu
vĕṟavaga sedigŏddi vĕṟam̐jaro mīru

(||||)
pĕṭṭiri gŏllĕdalĕlla pĕrugu nĕyyi vuṭla
kŏṭṭaro kŏṭṭaro mīru kolalavāru
tiṭṭeru vārilladivo tĕgi daggaragadŏllĕ
paṭṭaro vāralu mīru paim̐gārebālu

(||||)
yĕṁchi pĕṭṭiri dŏṁtula neḍalenisakkilālu
diṁcharo kuṁḍaladone diguvagunu
pĕṁchulayinadām̐kā pĕnam̐geru manadoḍa
tuṁchi noravesugŏni tŏlam̐garo mīru

(||||)
takkaga yaḍugulĕllā dām̐siri tamasŏmmaṁṭā
sikkĕm̐ jikkĕm̐ dīsugoro nena vunnavi
yĕkkĕnu śhrī veṁkaḍādri idivo manakṛṣhṇum̐ḍu
sakkanāyam̐ banulĕllām̐ jāliṁchi rāro