గుణము దెలిసెనంటా గుబ్బున నున్నాఁడతఁడు
(॥పల్లవి॥)
గుణము దెలిసెనంటా గుబ్బున నున్నాఁడతఁడు
అని(ణి?) వెట్టి మమ్ము మాటలాడించేవే నీవు
(॥గుణము॥)
చెక్కునఁ బెట్టినచేయి సిగ్గులే వడియఁజొచ్చె
యెక్కువపతిఁ జెనకేదెపుడే యిఁక
ముక్కునఁ బెట్టినవేలు ముసిముసి నవ్వులూరీ
మక్కళించి నీవాడే మాటలెప్పుడే
(॥గుణము॥)
తప్పక చూచినచూపు తలపోఁతలే పెంచీ
కప్పురబాగాలిచ్చే గతులెప్పుడే
కప్పిన పయ్యదకొంగు కమ్మఁజెమటలుబ్బించీ
విప్పుచు మోవితేనెవిందులు వెట్టేదెవుడే
(॥గుణము॥)
మంచముపై నున్నకేలు మర్మములెల్లానెత్తిచ్చీ
నించిన రతులలోని నేరుపెప్పుడే
యెంచుక శ్రీవెంకటేశునింతలోనఁ గూడితివి
చుంచుల సరసముల సుద్దులెప్పుడే
(||pallavi||)
guṇamu dĕlisĕnaṁṭā gubbuna nunnām̐ḍadam̐ḍu
ani(ṇi?) vĕṭṭi mammu māḍalāḍiṁcheve nīvu
(||guṇamu||)
sĕkkunam̐ bĕṭṭinaseyi siggule vaḍiyam̐jŏchchĕ
yĕkkuvabadim̐ jĕnagedĕbuḍe yim̐ka
mukkunam̐ bĕṭṭinavelu musimusi navvulūrī
makkaḽiṁchi nīvāḍe māḍalĕppuḍe
(||guṇamu||)
tappaga sūsinasūbu talabom̐tale pĕṁchī
kappurabāgālichche gadulĕppuḍe
kappina payyadagŏṁgu kammam̐jĕmaḍalubbiṁchī
vippusu movidenĕviṁdulu vĕṭṭedĕvuḍe
(||guṇamu||)
maṁchamubai nunnagelu marmamulĕllānĕttichchī
niṁchina radulaloni nerubĕppuḍe
yĕṁchuga śhrīvĕṁkaḍeśhuniṁtalonam̐ gūḍidivi
suṁchula sarasamula suddulĕppuḍe