Gumidaana rebu maabum gosi raabimchamga nela

గుమితాన రేపు మాపుఁ గోసి రాపించఁగ నేల
Language

(॥పల్లవి॥)
గుమితాన రేపు మాపుఁ గోసి రాపించఁగ నేల
సముకాన దాని నన్ను జగడించ విడరా

(॥గుమితాన॥)
దుండగాన నాపెచేతఁ దుటారము లాడించేవు
అండకు రావ ద్దంటే నే నట్టే మానవా
చండి పెట్టి యాఁటదాని జవ్వనము గాకు సేసి
కండ గట్టుకొంటేఁ జాలు కా దనేనా నేను

(॥గుమితాన॥)
చన విచ్చి యాపె నాతో సరి వోరించఁగ నేల
తనువు నీ కిమ్మన్న దక్క నియ్యనా
మనసు రానివాఁడవు మాతోడి గొడవేల
కొన మాటాడితేఁ జాలు కొసరేనా నేను

(॥గుమితాన॥)
యిద్దరిఁ గాఁగిలింపించి యేకము సేయఁగ నేల
అద్దో నీ చెప్పినట్టు సేయక మానేనా
గద్దరి శ్రీవెంకటేశ కమ్మటిఁ గూడితి నన్ను
వొద్ద నీ విట్టే వుంటే వొరసేనా నేను

(||pallavi||)
gumidāna rebu mābum̐ gosi rābiṁcham̐ga nela
samugāna dāni nannu jagaḍiṁcha viḍarā

(||gumidāna||)
duṁḍagāna nābĕsedam̐ duḍāramu lāḍiṁchevu
aṁḍagu rāva ddaṁṭe ne naṭṭe mānavā
saṁḍi pĕṭṭi yām̐ṭadāni javvanamu gāgu sesi
kaṁḍa gaṭṭugŏṁṭem̐ jālu kā danenā nenu

(||gumidāna||)
sana vichchi yābĕ nādo sari voriṁcham̐ga nela
tanuvu nī kimmanna dakka niyyanā
manasu rānivām̐ḍavu mādoḍi gŏḍavela
kŏna māḍāḍidem̐ jālu kŏsarenā nenu

(||gumidāna||)
yiddarim̐ gām̐giliṁpiṁchi yegamu seyam̐ga nela
addo nī sĕppinaṭṭu seyaga mānenā
gaddari śhrīvĕṁkaḍeśha kammaḍim̐ gūḍidi nannu
vŏdda nī viṭṭe vuṁṭe vŏrasenā nenu