గుదిగొన్న తమితోడ గుబ్బతిలీని
(॥పల్లవి॥)
గుదిగొన్న తమితోడ గుబ్బతిలీని
మదనకేలికి నీవె మన్నించవోయి
(॥గుది॥)
మగువ నిన్నుఁజూచి మనులోఁ దలపోసి
జిగిమించ మేనఁ జిందీఁ జెమటలు
నిగిడించీఁ బులకలు నిలువెల్లా జాజుకొన
సోగిసి యాపెదిక్కు చూచితివా వోయి
(॥గుది॥)
మఱి నీవద్ద నిలిచి మాట లోయ్యనే డి
చిఱునవ్వులు నవ్వీ శిరసు వంచి
కఱఁగికఱఁగి నీకుఁ గడుఁబదనై వున్నది
యెఱిఁగితివా నీవు యీపెభావ మోయి
(॥గుది॥)
చెలిమి నీతోఁ జేసి సిగ్గులెల్లాఁ బచరించి
బలువైనయాసతో నీపాదలోత్తీని
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
యిల నన్నునేలితివి యీకెఁ గూడవోయి
(||pallavi||)
gudigŏnna tamidoḍa gubbadilīni
madanageligi nīvĕ manniṁchavoyi
(||gudi||)
maguva ninnum̐jūsi manulom̐ dalabosi
jigimiṁcha menam̐ jiṁdīm̐ jĕmaḍalu
nigiḍiṁchīm̐ bulagalu niluvĕllā jājugŏna
sogisi yābĕdikku sūsidivā voyi
(||gudi||)
maṟi nīvadda nilisi māḍa loyyane ḍi
siṟunavvulu navvī śhirasu vaṁchi
kaṟam̐gigaṟam̐gi nīgum̐ gaḍum̐badanai vunnadi
yĕṟim̐gidivā nīvu yībĕbhāva moyi
(||gudi||)
sĕlimi nīdom̐ jesi siggulĕllām̐ basariṁchi
baluvainayāsado nībādalottīni
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
yila nannunelidivi yīgĕm̐ gūḍavoyi