Gubbadille tamaloni guddiraa limte kaaga

గుబ్బతిల్లె తమలోని గుద్దిరా లింతే కాక
Language

(॥పల్లవి॥)
గుబ్బతిల్లె తమలోని గుద్దిరా లింతే కాక
గొబ్బున నీడకు వచ్చి కొంగు వట్టఁ గలదా

(॥గుబ్బతిల్లె॥)
ఆతఁడే నాయింట నున్నాఁ డందరు సతులుఁ గూడి
యేతులకుఁ గోపగించి యేమి సేసేరే
చూతమువో వొక్క తైనా సోరిదిఁ గాంతునిఁ దమ
చేతికి లోనుగాఁ జేసి చిక్కించుకోఁ గలదా

(॥గుబ్బతిల్లె॥)
చనవు నా కిచ్చినాఁడు సవతు లెందరు గల్లా
యెనయక నామీఁద నేమి సేసెరే
ననుపున నొక తైనా నన్నుఁ గూడినట్టిపతిఁ
బెనఁగి వేరె వలపించుకొనఁ గలదా

(॥గుబ్బతిల్లె॥)
బాసతోడ నన్నుఁ గూడెఁ బైకొని శ్రీవెంకటేశుఁ
డీసులవా రిందరును యేమి సేసేరే
ఆస లింతే కాక వచ్చి అందులో నొకతె యైనా
నాసరి నుండి పతితో నవ్వి చూడఁ గలదా

(||pallavi||)
gubbadillĕ tamaloni guddirā liṁte kāga
gŏbbuna nīḍagu vachchi kŏṁgu vaṭṭam̐ galadā

(||gubbadillĕ||)
ādam̐ḍe nāyiṁṭa nunnām̐ ḍaṁdaru sadulum̐ gūḍi
yedulagum̐ gobagiṁchi yemi sesere
sūdamuvo vŏkka tainā soridim̐ gāṁtunim̐ dama
sedigi lonugām̐ jesi sikkiṁchugom̐ galadā

(||gubbadillĕ||)
sanavu nā kichchinām̐ḍu savadu lĕṁdaru gallā
yĕnayaga nāmīm̐da nemi sesĕre
nanubuna nŏga tainā nannum̐ gūḍinaṭṭibadim̐
bĕnam̐gi verĕ valabiṁchugŏnam̐ galadā

(||gubbadillĕ||)
bāsadoḍa nannum̐ gūḍĕm̐ baigŏni śhrīvĕṁkaḍeśhum̐
ḍīsulavā riṁdarunu yemi sesere
āsa liṁte kāga vachchi aṁdulo nŏgadĕ yainā
nāsari nuṁḍi padido navvi sūḍam̐ galadā