గోవిందుఁ డీ బాలుఁడు గోపాలుఁడు
(॥పల్లవి॥)
గోవిందుఁ డీ బాలుఁడు గోపాలుఁడు
కావింప రేపల్లెలోని కాంతాలోలుఁడు
(॥॥)
జనియించెఁ గృష్ణుఁడు సర్వలోక జిష్ణుఁడు
దనుజాంతకుఁడు యీతఁడే విష్ణుఁడు
పనివడి సజ్జనుల పాలికి వర్ధిష్ణుఁడు
సనకాదుల మతుల సంచరిష్ణుఁడు
(॥॥)
పెరిగెఁ గంస జైత్రుఁడు భీషణ తేజ మిత్రుఁడు
వర వసు దేవ దేవకీ పుత్రుఁడు
సరస భావించి చూడ సర్వజీవగాత్రుఁడు
పరగ రుక్మిణి సత్యభామాకళత్రుఁడు
(॥॥)
వెలసె భూధరుఁడు విశ్వలోక గురుఁడు
సులలిత బలభద్ర సోదరుఁడు
కలిత నిశ్చల శ్రీ వేంకటగిరి సంచారుఁడు
కలసిన యలమేల్మంగా మనోహరుఁడు
(||pallavi||)
goviṁdum̐ ḍī bālum̐ḍu gobālum̐ḍu
kāviṁpa reballĕloni kāṁtālolum̐ḍu
(||||)
janiyiṁchĕm̐ gṛṣhṇum̐ḍu sarvaloga jiṣhṇum̐ḍu
danujāṁtagum̐ḍu yīdam̐ḍe viṣhṇum̐ḍu
panivaḍi sajjanula pāligi vardhiṣhṇum̐ḍu
sanagādula madula saṁchariṣhṇum̐ḍu
(||||)
pĕrigĕm̐ gaṁsa jaitrum̐ḍu bhīṣhaṇa teja mitrum̐ḍu
vara vasu deva devagī putrum̐ḍu
sarasa bhāviṁchi sūḍa sarvajīvagātrum̐ḍu
paraga rukmiṇi satyabhāmāgaḽatrum̐ḍu
(||||)
vĕlasĕ bhūdharum̐ḍu viśhvaloga gurum̐ḍu
sulalida balabhadra sodarum̐ḍu
kalida niśhchala śhrī veṁkaḍagiri saṁchārum̐ḍu
kalasina yalamelmaṁgā manoharum̐ḍu