(॥పల్లవి॥)
గోవిందా శ్రితగోకులబృందా
పావన జయ జయ పరమానందా
(॥గోవిందా॥)
జగదభిరామ సహస్రనామా
సుగుణధామ సంస్తుతనామా
గగనశ్యామా ఘనరిపుభీమా
అగణితరఘు వంశాంబుధి సోమా
(॥గోవిందా॥)
జననుతచరణా శరణ్యశరణా
దనుజహరణ లలితస్ఫురణా
అనుఘాచర ణాయత భూభరణా
దినకరసన్నిభదివ్యాభరణా
(॥గోవిందా॥)
గరుడతురంగా కారోత్తుంగా
శరధిభంగా ఫణిశయనంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీవేంకటగిరిపతి రంగా
(||pallavi||)
goviṁdā śhridagogulabṛṁdā
pāvana jaya jaya paramānaṁdā
(||goviṁdā||)
jagadabhirāma sahasranāmā
suguṇadhāma saṁstudanāmā
gaganaśhyāmā ghanaribubhīmā
agaṇidaraghu vaṁśhāṁbudhi somā
(||goviṁdā||)
jananudasaraṇā śharaṇyaśharaṇā
danujaharaṇa lalidasphuraṇā
anughāsara ṇāyada bhūbharaṇā
dinagarasannibhadivyābharaṇā
(||goviṁdā||)
garuḍaduraṁgā kārottuṁgā
śharadhibhaṁgā phaṇiśhayanaṁgā
karuṇābāṁgā kamalāsaṁgā
vara śhrīveṁkaḍagiribadi raṁgā