Govimdaa ne nittivaamda gurudu ninneṟimgeenaa

గోవిందా నే నిట్టివాఁడ గురుతు నిన్నెఱిఁగీనా
Language

(॥పల్లవి॥)
గోవిందా నే నిట్టివాఁడ గురుతు నిన్నెఱిఁగీనా
యీ విన్నప మిది నాది యింకా నీ చిత్తము

(॥గోవింద॥)
పొలఁతుల భావ మనేభూతము సోఁకినవాఁడు
తలఁకక తనమేను తా నెఱిఁగీనా
మలసి యౌవనపు వున్మాద మెత్తినట్టివాఁడు
వెలయ సన్మార్గము వివేకించీనా

(॥గోవింద॥)
మించుల సంపదల వుమ్మెత్తకాయఁ దిన్నవాఁడు
అంచల గురువు దైవమని యెంచీనా
పంచల కర్మమనేటి బలునావెక్కినవాఁడు
చంచలానఁ బొందక చక్క నడచీనా

(॥గోవింద॥)
మాయల సంసారమనే మంకు వట్టినట్టివాఁడు
చాయకు బుద్ది చెప్పితే సమ్మతించీనా
యీయెడ శ్రీవేంకటేశ యింతట నన్నుఁ గాచితి
నీ యాధీనమైనవాఁడు నేరమి సేసీనా

(||pallavi||)
goviṁdā ne niṭṭivām̐ḍa gurudu ninnĕṟim̐gīnā
yī vinnaba midi nādi yiṁkā nī sittamu

(||goviṁda||)
pŏlam̐tula bhāva manebhūdamu som̐kinavām̐ḍu
talam̐kaga tanamenu tā nĕṟim̐gīnā
malasi yauvanabu vunmāda mĕttinaṭṭivām̐ḍu
vĕlaya sanmārgamu vivegiṁchīnā

(||goviṁda||)
miṁchula saṁpadala vummĕttagāyam̐ dinnavām̐ḍu
aṁchala guruvu daivamani yĕṁchīnā
paṁchala karmamaneḍi balunāvĕkkinavām̐ḍu
saṁchalānam̐ bŏṁdaga sakka naḍasīnā

(||goviṁda||)
māyala saṁsāramane maṁku vaṭṭinaṭṭivām̐ḍu
sāyagu buddi sĕppide sammadiṁchīnā
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁtaḍa nannum̐ gāsidi
nī yādhīnamainavām̐ḍu nerami sesīnā