Govimda namdanamdana gobaalakrshna nee

గోవింద నందనందన గోపాలకృష్ణ నీ
Language

(॥పల్లవి॥)
గోవింద నందనందన గోపాలకృష్ణ నీ-
భావము మాకుఁ జిక్కె గోపాలకృష్ణ

(॥గోవింద॥)
కొంగువట్టే వదేమోయి గోపాలకృష్ణ మా
పంగెన కోపుదువా గోపాలకృష్ణ
గొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణ
బంగారుకాశతోడి గోపాలకృష్ణ

(॥గోవింద॥)
కొమ్మల చీర లంటిన గోపాలకృష్ణ
పమ్మి నిన్ను దిట్టము గోపాలకృష్ణ
కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ
బమ్మెర పో కిందుల గోపాలకృష్ణ

(॥గోవింద॥)
కొసరకు మంత నీవు గోపాలకృష్ణ నీ
పస నీ నెఱుఁగనా గోపాల కృష్ణ
పొసఁగ శ్రీవేంకటాద్రిఁ బొందితి నన్ను
పసి మెక్కె మొగము గోపాలకృష్ణ

(||pallavi||)
goviṁda naṁdanaṁdana gobālakṛṣhṇa nī-
bhāvamu māgum̐ jikkĕ gobālakṛṣhṇa

(||goviṁda||)
kŏṁguvaṭṭe vademoyi gobālakṛṣhṇa mā
paṁgĕna kobuduvā gobālakṛṣhṇa
gŏṁgadanāla navvevu gobālakṛṣhṇa
baṁgārugāśhadoḍi gobālakṛṣhṇa

(||goviṁda||)
kŏmmala sīra laṁṭina gobālakṛṣhṇa
pammi ninnu diṭṭamu gobālakṛṣhṇa
kummariṁche vela siggu gobālakṛṣhṇa
bammĕra po kiṁdula gobālakṛṣhṇa

(||goviṁda||)
kŏsaragu maṁta nīvu gobālakṛṣhṇa nī
pasa nī nĕṟum̐ganā gobāla kṛṣhṇa
pŏsam̐ga śhrīveṁkaḍādrim̐ bŏṁdidi nannu
pasi mĕkkĕ mŏgamu gobālakṛṣhṇa