Govimda mugumda krshna gobeenaatha narahari

గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి
Language

(॥పల్లవి॥)
గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి
పూవు గలుగఁగ పిందె పుట్టె నింతే కాక

(॥గోవింద॥)
బూమిలో నిద్రించువాఁడు పొద్దువేళ యేఱిఁగీనా
నీమాయలో మునిఁగి నన్ను నెఱిఁగీనా
కామించి నీవు నన్నుఁ గరుణించి యేలుకోఁగా
నీమఱఁగువాఁడ నని నేఁ డంటీఁ గాక

(॥గోవింద॥)
సరి చంటి బిడ్డఁడు సంసార చింత లెంచీనా
గరిమ నజ్ఞానుఁడు కైంకర్య మెంచీనా
నిరతి దయ దలఁచి నీవు పెర రేఁపఁగా
కెరలి నే నీకు మొక్కితిఁ గాక

(॥గోవింద॥)
తుద కెక్క సన్యాసి తొంటి కర్మము సేసిన
యిదివో నిన్నుఁ దలఁచి యీతలఁ దడవేనా
యెదుట శ్రీ వేంకటేశ యిహపరములు నీవై
పొదిగి పాలార్చఁగాను పొడవైతిఁ గాక

(||pallavi||)
goviṁda muguṁda kṛṣhṇa gobīnātha narahari
pūvu galugam̐ga piṁdĕ puṭṭĕ niṁte kāga

(||goviṁda||)
būmilo nidriṁchuvām̐ḍu pŏdduveḽa yeṟim̐gīnā
nīmāyalo munim̐gi nannu nĕṟim̐gīnā
kāmiṁchi nīvu nannum̐ garuṇiṁchi yelugom̐gā
nīmaṟam̐guvām̐ḍa nani nem̐ ḍaṁṭīm̐ gāga

(||goviṁda||)
sari saṁṭi biḍḍam̐ḍu saṁsāra siṁta lĕṁchīnā
garima najñānum̐ḍu kaiṁkarya mĕṁchīnā
niradi daya dalam̐si nīvu pĕra rem̐pam̐gā
kĕrali ne nīgu mŏkkidim̐ gāga

(||goviṁda||)
tuda kĕkka sanyāsi tŏṁṭi karmamu sesina
yidivo ninnum̐ dalam̐si yīdalam̐ daḍavenā
yĕduḍa śhrī veṁkaḍeśha yihabaramulu nīvai
pŏdigi pālārsam̐gānu pŏḍavaidim̐ gāga