Goramboyye panigimgaa goddalemtigi

గోరఁబొయ్యే పనికిఁగా గొడ్డలేఁటికి
Language

(॥పల్లవి॥)
గోరఁబొయ్యే పనికిఁగా గొడ్డలేఁటికి
ఆరయ నాతఁడే చెప్పీ నతివకు బుద్దులు

(॥॥)
చిత్తములోపలిచింత చెక్కుచేతఁ గానవచ్చె
అత్తి మాటాడించకురే అంగన నంత-
బత్తిగలవారమైతే పతిఁ దోడితెత్త మిట్టె
వొత్తి యాకె నేమన్న వొప్పగించీఁ దనువు

(॥॥)
నిండినమైవిరహము నిట్టూర్పులను మించె-
నండనే నవ్వించకురే ఆయాలు రేఁగీ
వుండరే చుట్టాలమైతే నొక్కటిసేత మిద్దరి
చండిపెట్టి పిలిచితే చలపట్టీ నలుక

(॥॥)
కూడేటితమకములు కొనచూపులందుఁ దేరె
తోడనే యుడుగకువే తొలఁగీ సిగ్గు
యీడకే శ్రీ వేంకటేశుఁ డేతెంచి కలసె నేఁడు
వాడికతో సతి మీరవలపించె నతని

(||pallavi||)
goram̐bŏyye panigim̐gā gŏḍḍalem̐ṭigi
āraya nādam̐ḍe sĕppī nadivagu buddulu

(||||)
sittamulobalisiṁta sĕkkusedam̐ gānavachchĕ
atti māḍāḍiṁchagure aṁgana naṁta-
battigalavāramaide padim̐ doḍidĕtta miṭṭĕ
vŏtti yāgĕ nemanna vŏppagiṁchīm̐ danuvu

(||||)
niṁḍinamaivirahamu niṭṭūrbulanu miṁchĕ-
naṁḍane navviṁchagure āyālu rem̐gī
vuṁḍare suṭṭālamaide nŏkkaḍiseda middari
saṁḍibĕṭṭi piliside salabaṭṭī naluga

(||||)
kūḍeḍidamagamulu kŏnasūbulaṁdum̐ derĕ
toḍane yuḍugaguve tŏlam̐gī siggu
yīḍage śhrī veṁkaḍeśhum̐ ḍedĕṁchi kalasĕ nem̐ḍu
vāḍigado sadi mīravalabiṁchĕ nadani