Gomtari vinnidaa ninnum gosaramgam jodedi

గొంటరి విన్నిటా నిన్నుఁ గొసరఁగఁ జోటేది
Language

(॥పల్లవి॥)
గొంటరి విన్నిటా నిన్నుఁ గొసరఁగఁ జోటేది
వింట గాక నీ సుద్దులు వెఱచేవా ఇందుకు

(॥గొంట॥)
పల్లదపుమాటలాడి పక్కన వేడుకొనేది
చెల్లునయ్యా నీకే యిట్టి చేఁతలెల్లాను
కల్ల నీ మీఁదనే మోపి కడవారేమనినాను
వెల్లవిరిగా నీవు వెఱచేవా ఇందుకు

(॥గొంట॥)
విరులనుఁ దాఁకవేసి విడెము చేతికిచ్చేది
దొరవు నీ కలవాటు తొల్లే యిది
తరమిడి నీకింత తగవని యెవ్వరన్నా
విరివి గొందువుగాని వెఱచేవా యిందుకు

(॥గొంట॥)
గక్కన గోరు దాఁకించి కాఁగిలించ కూడేది
దక్కెనయ్యా శ్రీ వేంకటోత్తముఁడ నీకు
చక్కని యలమేల్మంగ సాదించి నీవురమెక్కె
వెక్కస మౌదువుగాక వెఱచేవా యిందుకు

(||pallavi||)
gŏṁṭari vinniḍā ninnum̐ gŏsaram̐gam̐ joḍedi
viṁṭa gāga nī suddulu vĕṟasevā iṁdugu

(||gŏṁṭa||)
palladabumāḍalāḍi pakkana veḍugŏnedi
sĕllunayyā nīge yiṭṭi sem̐talĕllānu
kalla nī mīm̐dane mobi kaḍavāremaninānu
vĕllavirigā nīvu vĕṟasevā iṁdugu

(||gŏṁṭa||)
virulanum̐ dām̐kavesi viḍĕmu sedigichchedi
dŏravu nī kalavāḍu tŏlle yidi
taramiḍi nīgiṁta tagavani yĕvvarannā
virivi gŏṁduvugāni vĕṟasevā yiṁdugu

(||gŏṁṭa||)
gakkana goru dām̐kiṁchi kām̐giliṁcha kūḍedi
dakkĕnayyā śhrī veṁkaḍottamum̐ḍa nīgu
sakkani yalamelmaṁga sādiṁchi nīvuramĕkkĕ
vĕkkasa mauduvugāga vĕṟasevā yiṁdugu