గొల్లెతలకేలరా గోవజవ్వాది నీకు
(॥పల్లవి॥)
గొల్లెతలకేలరా గోవజవ్వాది నీకు
చెల్లుఁగాక యెటువలెఁ జేసినా నన్ను (ను?)
(॥గొల్లెత॥)
కట్టినది అంచులతొగరుఁ జీర సందిఁ
బెట్టినది మొలవంక పెద్దగాజు
మెట్టిన కంచుమట్టెల మించుమోఁత చేత-
బట్టినది చల్లచాడె పట్టకురా నన్నును
(॥గొల్లెత॥)
మాసినది తురుము చెమరుకంపు నే
వేసినది వెండికుప్పె వెంట్రుకదండ
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల చేయి
తీసేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును
(॥గొల్లెత॥)
ముంచినవి చెమటలు మోమునిండ కడు-
నంచినది చూడరా నావాలుఁజూపు
యెంచనేల నన్నునిట్టె యేలితివి వోరి
చెంచెతల లంజకాఁడ శ్రీవేంకటేశుఁడా
(||pallavi||)
gŏllĕdalagelarā govajavvādi nīgu
sĕllum̐gāga yĕḍuvalĕm̐ jesinā nannu (nu?)
(||gŏllĕda||)
kaṭṭinadi aṁchuladŏgarum̐ jīra saṁdim̐
bĕṭṭinadi mŏlavaṁka pĕddagāju
mĕṭṭina kaṁchumaṭṭĕla miṁchumom̐ta seda-
baṭṭinadi sallasāḍĕ paṭṭagurā nannunu
(||gŏllĕda||)
māsinadi turumu sĕmarugaṁpu ne
vesinadi vĕṁḍiguppĕ vĕṁṭrugadaṁḍa
vosigŏṭlu gŏṭṭi kaṁchuḍuṁgarāla seyi
tīsevu nī sĕllĕdoḍu tiyyagurā nannunu
(||gŏllĕda||)
muṁchinavi sĕmaḍalu momuniṁḍa kaḍu-
naṁchinadi sūḍarā nāvālum̐jūbu
yĕṁchanela nannuniṭṭĕ yelidivi vori
sĕṁchĕdala laṁjagām̐ḍa śhrīveṁkaḍeśhum̐ḍā