Golledala nimtasesee govimdumdu

గొల్లెతల నింతసేసీ గోవిందుఁడు
Language

(॥పల్లవి॥)
గొల్లెతల నింతసేసీ గోవిందుఁడు
కొల్లకాఁడు రేపల్లె గోవిందుఁడు

(॥॥)
పలుకుల భమ్రయించె భావములఁ గరఁగించె
కొలనికరత నవ్వె గోవిందుఁడు
యెలయించి యప్పటి మాయింటిలేనే పవ్వళించె
కొలఁదిమీరినవాఁడు గోవిందుఁడు

(॥॥)
వూరక పువ్వుల వేసె నొకటొకటేసేసె
కూరిమిఁ దప్పకచూచె గోవిందుఁడు
చేరి మావారుండ వారు చెప్పరాదు తనదూరు
కోరి యశోద నీ బిడ్డ గోవిందుఁడు

(॥॥)
సమ్మతించఁ జేయివేసె చన్నులతోనే రాసె
కుమ్మరించె వలపులు గోవిందఁడు
దొమ్మిసేసి మమ్ముఁగూడె దొరవలె నదె వాఁడె
కొమ్మరో శ్రీ వేంకటాద్రి గోవిందుఁడు

(||pallavi||)
gŏllĕdala niṁtasesī goviṁdum̐ḍu
kŏllagām̐ḍu reballĕ goviṁdum̐ḍu

(||||)
palugula bhamrayiṁchĕ bhāvamulam̐ garam̐giṁchĕ
kŏlanigarada navvĕ goviṁdum̐ḍu
yĕlayiṁchi yappaḍi māyiṁṭilene pavvaḽiṁchĕ
kŏlam̐dimīrinavām̐ḍu goviṁdum̐ḍu

(||||)
vūraga puvvula vesĕ nŏgaḍŏgaḍesesĕ
kūrimim̐ dappagasūsĕ goviṁdum̐ḍu
seri māvāruṁḍa vāru sĕpparādu tanadūru
kori yaśhoda nī biḍḍa goviṁdum̐ḍu

(||||)
sammadiṁcham̐ jeyivesĕ sannuladone rāsĕ
kummariṁchĕ valabulu goviṁdam̐ḍu
dŏmmisesi mammum̐gūḍĕ dŏravalĕ nadĕ vām̐ḍĕ
kŏmmaro śhrī veṁkaḍādri goviṁdum̐ḍu