గొల్లదాన నింతే నేను; కొంగువట్ట దొరకొనె
(॥పల్లవి॥)
గొల్లదాన నింతే నేను; కొంగువట్ట దొరకొనె
యెల్లవారుఁ జూడఁగాను యేమిసేతునే
(॥గొల్ల॥)
కన్నుల జంకించీని కైదండ వట్టీని
వున్నతపు కొనగోర నొత్తీని
చన్నులు చేతఁబట్టీని సరసములాడీని
యెన్ని చెప్పినా మానఁడు యేమిసేతునే
(॥గొల్ల॥)
తీగెనవ్వు నవ్వీని తెరలోనికి రమ్మనీ
బాగుగాఁ దానే కస్తూరి పైఁబూసీని
వేగిరించి వలపులు వెల్లవిరిగాఁ జేసీనీ
యీగతి వీని గుణము లేమిసేతునే
(॥గొల్ల॥)
మొక్కలానఁ గాఁగిలించి మోవి గంటిచేసీని
చిక్కుదీసి శిరసుపై సేసవెట్టీని
గక్కున శ్రీవేంకటాద్రి ఘనుఁడిట్టె నన్నుఁ గూడె
యెక్కువగా మన్నించీ నేమిసేతునే
(||pallavi||)
gŏlladāna niṁte nenu; kŏṁguvaṭṭa dŏragŏnĕ
yĕllavārum̐ jūḍam̐gānu yemisedune
(||gŏlla||)
kannula jaṁkiṁchīni kaidaṁḍa vaṭṭīni
vunnadabu kŏnagora nŏttīni
sannulu sedam̐baṭṭīni sarasamulāḍīni
yĕnni sĕppinā mānam̐ḍu yemisedune
(||gŏlla||)
tīgĕnavvu navvīni tĕralonigi rammanī
bāgugām̐ dāne kastūri paim̐būsīni
vegiriṁchi valabulu vĕllavirigām̐ jesīnī
yīgadi vīni guṇamu lemisedune
(||gŏlla||)
mŏkkalānam̐ gām̐giliṁchi movi gaṁṭisesīni
sikkudīsi śhirasubai sesavĕṭṭīni
gakkuna śhrīveṁkaḍādri ghanum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
yĕkkuvagā manniṁchī nemisedune