Golla domadaaya nemdu kommalagu needo pomdu

గొల్ల దోమటాయ నేఁడు కొమ్మలకు నీతో పొందు
Language

(॥పల్లవి॥)
గొల్ల దోమటాయ నేఁడు కొమ్మలకు నీతో పొందు
మెల్లనే సరసమాడ మేము నిట్టె వలెనా

(॥గొల్ల॥)
వాసులకే మాటలాడి వట్టి చనవు సేసుక
రాసి కెక్కే రదివో నీరామలెల్లను
వేసరినఁ బోనీక వేడుక నవ్వులు నవ్వి
నీ సరికే వచ్చిరిగా నేఁడు వీరెల్లాను

(॥గొల్ల॥)
సందడి జాణతనాలు సారెకు నీపై వేసి
కందువకే వచ్చిరిగా కాంతలెల్లాను
విందుల మోవులు చూపి వేమారుఁ గొలువుసేసి
యిందరైరిగా నీకు నిల్లాండ్లు

(॥గొల్ల॥)
వసంతములాడుతానే వడి నిన్నుఁ గాఁగిలించి
యెసరెత్తిరిగా మోహాలింతు లెల్లాను
యెసఁగ శ్రీ వేంకటేశ ఇదె నన్నుఁగూడితివి
దొసకులు వేసిరిగా తొల్లిటివా రిపుడు

(||pallavi||)
gŏlla domaḍāya nem̐ḍu kŏmmalagu nīdo pŏṁdu
mĕllane sarasamāḍa memu niṭṭĕ valĕnā

(||gŏlla||)
vāsulage māḍalāḍi vaṭṭi sanavu sesuga
rāsi kĕkke radivo nīrāmalĕllanu
vesarinam̐ bonīga veḍuga navvulu navvi
nī sarige vachchirigā nem̐ḍu vīrĕllānu

(||gŏlla||)
saṁdaḍi jāṇadanālu sārĕgu nībai vesi
kaṁduvage vachchirigā kāṁtalĕllānu
viṁdula movulu sūbi vemārum̐ gŏluvusesi
yiṁdarairigā nīgu nillāṁḍlu

(||gŏlla||)
vasaṁtamulāḍudāne vaḍi ninnum̐ gām̐giliṁchi
yĕsarĕttirigā mohāliṁtu lĕllānu
yĕsam̐ga śhrī veṁkaḍeśha idĕ nannum̐gūḍidivi
dŏsagulu vesirigā tŏlliḍivā ribuḍu