గొల్ల దానఁ గదవయ్య గోవిందుఁడా
(॥పల్లవి॥)
గొల్ల దానఁ గదవయ్య గోవిందుఁడా
చిల్లరచేఁత లేఁటికిఁ జేసేవు గోవిందుఁడా
(॥గొల్ల॥)
వుంగరమేలడిగేవు వువిదలు చూడఁగాను
కొంగువట్టితీసి నీవు గోవిందుఁడా
అంగవించి యొఁసగితి వల్లనాఁడె నాకు నిది
సింగారాలు నీకు బాఁతే చెల్లఁబో గోవిందుఁడా
(॥గొల్ల ॥)
వొడి యేల సోదించేవు వూడిగపువా రుండఁగా
కొడిమెల కోప నేను గోవిందుఁడా
కడలేనిరతులనుఁ గాఁగిలించితి వప్పుడే
తడవకు మర్మము లుద్దండపుగోవిందుఁడా
(॥గొల్ల॥)
చన్నులేల పట్టేవు సవతులు నవ్వఁగాను
కొన్నేసిసుద్దులు చెప్పి గోవిందుఁడా
ఇన్నిటా శ్రీవేంకటాద్రి నిరవై నన్నేలితివి
మన్నించ పాయకుమీ ప్రేమమున గోవిందుఁడా
(||pallavi||)
gŏlla dānam̐ gadavayya goviṁdum̐ḍā
sillarasem̐ta lem̐ṭigim̐ jesevu goviṁdum̐ḍā
(||gŏlla||)
vuṁgaramelaḍigevu vuvidalu sūḍam̐gānu
kŏṁguvaṭṭidīsi nīvu goviṁdum̐ḍā
aṁgaviṁchi yŏm̐sagidi vallanām̐ḍĕ nāgu nidi
siṁgārālu nīgu bām̐te sĕllam̐bo goviṁdum̐ḍā
(||gŏlla ||)
vŏḍi yela sodiṁchevu vūḍigabuvā ruṁḍam̐gā
kŏḍimĕla koba nenu goviṁdum̐ḍā
kaḍaleniradulanum̐ gām̐giliṁchidi vappuḍe
taḍavagu marmamu luddaṁḍabugoviṁdum̐ḍā
(||gŏlla||)
sannulela paṭṭevu savadulu navvam̐gānu
kŏnnesisuddulu sĕppi goviṁdum̐ḍā
inniḍā śhrīveṁkaḍādri niravai nannelidivi
manniṁcha pāyagumī premamuna goviṁdum̐ḍā