Ghoraduridamulase gunavigaaramulase

ఘోరదురితములచే గుణవికారములచే
Language

(॥పల్లవి॥)
ఘోరదురితములచే గుణవికారములచే-
నిరితిఁ బడు నాకు నేది దెరువు

(॥ఘెర॥)
హరి జగన్నాథు లోకరాధ్యు-
నెరఁగనేరనివాని కేది దెరువు
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి-
నిరవుకొలుపనివాని కేది దెరువు

(॥ఘెర॥)
శ్రీ వేంకటేశుఁ దలఁచినవెనక సకలంబు ...
నేవగింపనివారి కేది దెరువు
దేవోత్తముని మహిమ దెలిసితెలియఁగలేని-
యీవివేకంబునకు నేది దెరువు

(||pallavi||)
ghoraduridamulase guṇavigāramulase-
niridim̐ baḍu nāgu nedi dĕruvu

(||ghĕra||)
hari jagannāthu logarādhyu-
nĕram̐ganeranivāni kedi dĕruvu
paramaburuṣhuni jagadbharidu naṁtarvyāpti-
niravugŏlubanivāni kedi dĕruvu

(||ghĕra||)
śhrī veṁkaḍeśhum̐ dalam̐sinavĕnaga sagalaṁbu ...
nevagiṁpanivāri kedi dĕruvu
devottamuni mahima dĕlisidĕliyam̐galeni-
yīvivegaṁbunagu nedi dĕruvu