ఘనుఁడు దానే కాక కలరా నాకు దిక్కు
(॥పల్లవి॥)
ఘనుఁడు దానే కాక కలరా నాకు దిక్కు
ఆనరమ్మ చెలులార ఆతనితో మీరు
(॥ఘనఁ॥)
చిత్తము నలసెను చెక్కు చెమరించెను
కొత్తగాఁగఁ దనరాక కోరి కోరి
వత్తియాయ దేహము వానలాయఁ గన్నీళ్లు
తత్తరపుఁ బతికేల దయ పుట్టదో
(॥ఘను॥)
తాలి మెందో దాఁగెను తలపోఁత రేఁగెను
అలకించి తన ఆడియాసలఁ జిక్కి
తీలుపడె నూరుపులు దిష్టమాయ వెరగులు
యీలాగు నన్ను మన్నించే దిఁక నెన్నఁడో
(॥ఘను॥)
పాయముఁ బైకొనెను భావము దాకొనెను
ఆయముతో నన్నుఁగూడి అంటఁగాను
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుగూడె
పోయినఁ బోనీ కెవ్వరు బోదించరో
(||pallavi||)
ghanum̐ḍu dāne kāga kalarā nāgu dikku
ānaramma sĕlulāra ādanido mīru
(||ghanam̐||)
sittamu nalasĕnu sĕkku sĕmariṁchĕnu
kŏttagām̐gam̐ danarāga kori kori
vattiyāya dehamu vānalāyam̐ gannīḽlu
tattarabum̐ badigela daya puṭṭado
(||ghanu||)
tāli mĕṁdo dām̐gĕnu talabom̐ta rem̐gĕnu
alagiṁchi tana āḍiyāsalam̐ jikki
tīlubaḍĕ nūrubulu diṣhṭamāya vĕragulu
yīlāgu nannu manniṁche dim̐ka nĕnnam̐ḍo
(||ghanu||)
pāyamum̐ baigŏnĕnu bhāvamu dāgŏnĕnu
āyamudo nannum̐gūḍi aṁṭam̐gānu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannugūḍĕ
poyinam̐ bonī kĕvvaru bodiṁcharo