Ghanumdavu simtagumta kambhamuraaya | mamum

ఘనుఁడవు చింతకుంట కంభమురాయ । మముఁ
Language

(॥పల్లవి॥)
ఘనుఁడవు చింతకుంట కంభమురాయ । మముఁ
గనుఁగొని రక్షించు కంభమురాయ

(॥ఘను॥)
కంతునిగురుఁడ వోకంభమురాయ శ్రీ
కాంతఁ దొడ పై నిడనకంభమురాయా
కాంతులు నీమేనెల్లఁ గంభము రాయ యే
కాఁతమాడే వింతులతోఁ గంభమురాయ

(॥ఘను॥)
కప్పురపువిడేలకంభమురాయ
కప్పము గొనే వింతటఁ గంభమురాయ
కప్పులుదేరీ నీమోవిఁ గంభమురాయ
కప్పుకొమ్మీ పచ్చడము కంభమురాయ

(॥ఘను॥)
కమ్మఁ జెమటలు నిండెఁ గంభమురాయ
కమ్మటిఁ గూడితి విట్టే కంభమురాయ
కమ్మొకొనెఁ బులకలు కంభమురాయ
కమ్మన(ని?) శ్రీవేంకటాద్రికంభమురాయ

(||pallavi||)
ghanum̐ḍavu siṁtaguṁṭa kaṁbhamurāya | mamum̐
ganum̐gŏni rakṣhiṁchu kaṁbhamurāya

(||ghanu||)
kaṁtunigurum̐ḍa vogaṁbhamurāya śhrī
kāṁtam̐ dŏḍa pai niḍanagaṁbhamurāyā
kāṁtulu nīmenĕllam̐ gaṁbhamu rāya ye
kām̐tamāḍe viṁtuladom̐ gaṁbhamurāya

(||ghanu||)
kappurabuviḍelagaṁbhamurāya
kappamu gŏne viṁtaḍam̐ gaṁbhamurāya
kappuluderī nīmovim̐ gaṁbhamurāya
kappugŏmmī pachchaḍamu kaṁbhamurāya

(||ghanu||)
kammam̐ jĕmaḍalu niṁḍĕm̐ gaṁbhamurāya
kammaḍim̐ gūḍidi viṭṭe kaṁbhamurāya
kammŏgŏnĕm̐ bulagalu kaṁbhamurāya
kammana(ni?) śhrīveṁkaḍādrigaṁbhamurāya