Ghanumdavu neevettunnaam gaadanemaa

ఘనుఁడవు నీవెట్టున్నాఁ గాదనేమా
Language

(॥పల్లవి॥)
ఘనుఁడవు నీవెట్టున్నాఁ గాదనేమా
వినఁగానే మీకు విన్నవించేము గాక

(॥ఘనుఁ॥)
చనవిచ్చి నీవు మాకు చలివాపఁగాఁ గదా
ననుపుసేసుక సారె నవ్వేము నేము
మనసు వేరొకటైతె మాటలాడ వచ్చేమా
వొనరి దయఁజూడఁగ నొరసేముగాక

(॥ఘనుఁ॥)
మందెమేళముగా మమ్ము మన్నించఁగాఁ గదా
సందడిఁ బెనఁగేము నీసరుస నేము
అందాలకు రాకుంటే నాయములు చెనకేమా
పొంది మమ్ము మెచ్చఁగానే భోగించేము గాక

(॥ఘనుఁ॥)
వావి సేసుకొని మమ్ము వడిఁ గలయఁగఁ గదా
వోవలఁ గుచగిరుల నొత్తేము నేము
శ్రీవేంకటేశ్వర నీవు చేపట్టకుంటే మొక్కేమా
కైవశము గాఁగానే కైకొంటిమి గాక

(||pallavi||)
ghanum̐ḍavu nīvĕṭṭunnām̐ gādanemā
vinam̐gāne mīgu vinnaviṁchemu gāga

(||ghanum̐||)
sanavichchi nīvu māgu salivābam̐gām̐ gadā
nanubusesuga sārĕ navvemu nemu
manasu verŏgaḍaidĕ māḍalāḍa vachchemā
vŏnari dayam̐jūḍam̐ga nŏrasemugāga

(||ghanum̐||)
maṁdĕmeḽamugā mammu manniṁcham̐gām̐ gadā
saṁdaḍim̐ bĕnam̐gemu nīsarusa nemu
aṁdālagu rāguṁṭe nāyamulu sĕnagemā
pŏṁdi mammu mĕchcham̐gāne bhogiṁchemu gāga

(||ghanum̐||)
vāvi sesugŏni mammu vaḍim̐ galayam̐gam̐ gadā
vovalam̐ gusagirula nŏttemu nemu
śhrīveṁkaḍeśhvara nīvu sebaṭṭaguṁṭe mŏkkemā
kaivaśhamu gām̐gāne kaigŏṁṭimi gāga