ఘనుఁడవు నీ వొళ్ళఁ గపట మేది
(॥పల్లవి॥)
ఘనుఁడవు నీ వొళ్ళఁ గపట మేది
ననిచి నీ ప్రియములు నమ్మివున్నదానను
(॥॥)
తలపోసి నీనిజాలు తారుకాణించనేఁ టికి
సెలవినవ్వులలోనే చేఁగదేరీని
వొలిసినట్ల నీవు వొట్టువెట్టుకోకు మింక
నలుగడ నీసుద్దులు నమ్మివున్నదానను
(॥॥)
పనివడి నన్ను నొడఁ బరచఁగ నేమిటికి
కనుసన్నలనే మేలు గానిపించీని
చెనకి పొందులు చూపి చేతులు చాఁచకు మిఁక
నను నెంత పొదిగేవు నమ్మివున్నదానను
(॥॥)
పైకొని నీవల పింత పచరించనేఁటికి
యీకడ నీకూటమిలో నేరుపడీని
జోకల శ్రీ వేంకటేశ చోక్కించితివి నన్నిఁక
నాకడవాఁడవని నే నమ్మివున్న దానను
(||pallavi||)
ghanum̐ḍavu nī vŏḽḽam̐ gabaḍa medi
nanisi nī priyamulu nammivunnadānanu
(||||)
talabosi nīnijālu tārugāṇiṁchanem̐ ṭigi
sĕlavinavvulalone sem̐gaderīni
vŏlisinaṭla nīvu vŏṭṭuvĕṭṭugogu miṁka
nalugaḍa nīsuddulu nammivunnadānanu
(||||)
panivaḍi nannu nŏḍam̐ barasam̐ga nemiḍigi
kanusannalane melu gānibiṁchīni
sĕnagi pŏṁdulu sūbi sedulu sām̐sagu mim̐ka
nanu nĕṁta pŏdigevu nammivunnadānanu
(||||)
paigŏni nīvala piṁta pasariṁchanem̐ṭigi
yīgaḍa nīgūḍamilo nerubaḍīni
jogala śhrī veṁkaḍeśha sokkiṁchidivi nannim̐ka
nāgaḍavām̐ḍavani ne nammivunna dānanu