Ghanumdavu bomkagumee kaddo ledo

ఘనుఁడవు బొంకకుమీ కద్దో లేదో
Language

(॥పల్లవి॥)
ఘనుఁడవు బొంకకుమీ కద్దో లేదో
చెనకి చేయి మీఁదుగాఁ జేఁత సేసెఁగా

(॥ఘను॥)
చెలరేఁగి చెలరేఁగి చేతులు వట్టుకొని
పిలిచి అప్పుడాపెతోఁ బెనఁగితివి
అలిగి ఆయింతి నిన్ను నట్టె బొమ్మల జంకించి
తిలకించి చెప్పరాని తిట్లు దిట్టెఁగా

(॥ఘను॥)
చెక్కునొక్కి చెక్కునొక్కి చేరి ప్రియములు చెప్పి
టెక్కుల నాప వొడివట్టి తీసితివి
వెక్కసపు కోపముతో వెలఁది నిన్నావేళ
పక్కన చేతిపువ్వబంతిఁ గొని వేసెఁగా

(॥ఘను॥)
కాఁగిలించి కాఁగిలించి కందువలకుఁ దీసి
ఆఁగి శ్రీవేంకటేశుఁడ అట్టె కూడితి
రాఁగిన తమకముతో రమణి నిన్నంతలోనే
చేఁగచన్నులనుఁ గుమ్మి సెలవుల నవ్వెఁగా

(||pallavi||)
ghanum̐ḍavu bŏṁkagumī kaddo ledo
sĕnagi seyi mīm̐dugām̐ jem̐ta sesĕm̐gā

(||ghanu||)
sĕlarem̐gi sĕlarem̐gi sedulu vaṭṭugŏni
pilisi appuḍābĕdom̐ bĕnam̐gidivi
aligi āyiṁti ninnu naṭṭĕ bŏmmala jaṁkiṁchi
tilagiṁchi sĕpparāni tiṭlu diṭṭĕm̐gā

(||ghanu||)
sĕkkunŏkki sĕkkunŏkki seri priyamulu sĕppi
ṭĕkkula nāba vŏḍivaṭṭi tīsidivi
vĕkkasabu kobamudo vĕlam̐di ninnāveḽa
pakkana sedibuvvabaṁtim̐ gŏni vesĕm̐gā

(||ghanu||)
kām̐giliṁchi kām̐giliṁchi kaṁduvalagum̐ dīsi
ām̐gi śhrīveṁkaḍeśhum̐ḍa aṭṭĕ kūḍidi
rām̐gina tamagamudo ramaṇi ninnaṁtalone
sem̐gasannulanum̐ gummi sĕlavula navvĕm̐gā