ఘనుఁడా నీమన సెంత గట్టో కాక
(॥పల్లవి॥)
ఘనుఁడా నీమన సెంత గట్టో కాక
నినుఁ జూచి వెరగంది నేననేఁ గాక
(॥ఘనుఁ॥)
నిట్టూర్పుగాలిచేత విలువఁ గలదా యింతి
నెట్టనఁ జనుఁగొండలే నిలిపెఁగాక
వుట్టిపడుమదనాగ్ని కోరుపఁగలదా మేన
జట్టిఁజెమటయేరులే చల్లార్చెఁగాక
(॥ఘనుఁ॥)
తుఱుము చీఁకటి ముంచె దూరఁగలదా యింతి
నెఱయ మోముచంద్రుఁడు నెగడెఁగాక
తఱిఁ బులకవాములు తరుణి మోయఁగలదా
పిఱిఁదిబండి గలుగ బీరమెక్కఁ గాక
(॥ఘనుఁ॥)
వలపనేనామెక్కి వనిత యేమైనఁగాదా
బలిమధరామృతాన బతికెఁగాక
నెలపై శ్రీవేంకటేశ నీవిట్టె సతిఁ గూడఁగ
తెలిసి నీవురముపైఁ దిరమాయఁ గాక
(||pallavi||)
ghanum̐ḍā nīmana sĕṁta gaṭṭo kāga
ninum̐ jūsi vĕragaṁdi nenanem̐ gāga
(||ghanum̐||)
niṭṭūrbugāliseda viluvam̐ galadā yiṁti
nĕṭṭanam̐ janum̐gŏṁḍale nilibĕm̐gāga
vuṭṭibaḍumadanāgni korubam̐galadā mena
jaṭṭim̐jĕmaḍayerule sallārsĕm̐gāga
(||ghanum̐||)
tuṟumu sīm̐kaḍi muṁchĕ dūram̐galadā yiṁti
nĕṟaya momusaṁdrum̐ḍu nĕgaḍĕm̐gāga
taṟim̐ bulagavāmulu taruṇi moyam̐galadā
piṟim̐dibaṁḍi galuga bīramĕkkam̐ gāga
(||ghanum̐||)
valabanenāmĕkki vanida yemainam̐gādā
balimadharāmṛtāna badigĕm̐gāga
nĕlabai śhrīveṁkaḍeśha nīviṭṭĕ sadim̐ gūḍam̐ga
tĕlisi nīvuramubaim̐ diramāyam̐ gāga