Ghanumda neevalanane kaamta kabbemgaaga ivi

ఘనుఁడ నీవలననే కాంత కబ్బెఁగాక ఇవి
Language

(॥పల్లవి॥)
ఘనుఁడ నీవలననే కాంత కబ్బెఁగాక ఇవి
అనువుగానిచోట నంటునా గుణము

(॥ఘను॥)
అంకెల నీమోవికెంపు లటు చూచి చెలియకు
కింకలఁ గనుఁగొనల కెంపులెక్కెను
పంకజము లేవూరు పచ్చిచిగు రేవూరు
అంకెల నొక్కటొక్కటి కంటునా గుణము

(॥ఘను॥)
జాఱుఁజెమటలమెయి సరులముత్యాలు చూచి
చీఱుముత్యా లొలికె నీచెలచెక్కుల
తీఱుటద్దా లేవూరు తీగెసోగ యేవూరు
ఆఱడి నొక్కటొకటి కంటునా గుణము

(॥ఘను॥)
కడుఁ జంద్రాభరణాలు కరములఁ జూచి నీకు
పడఁతికుచాల చంద్రాభరణా లంటె
బడిఁ దూండ్లేవూరు పయిఁడికుండ లేవూరు
అడరి శ్రీవేంకటేశ అంటునా గుణము

(||pallavi||)
ghanum̐ḍa nīvalanane kāṁta kabbĕm̐gāga ivi
anuvugānisoḍa naṁṭunā guṇamu

(||ghanu||)
aṁkĕla nīmovigĕṁpu laḍu sūsi sĕliyagu
kiṁkalam̐ ganum̐gŏnala kĕṁpulĕkkĕnu
paṁkajamu levūru pachchisigu revūru
aṁkĕla nŏkkaḍŏkkaḍi kaṁṭunā guṇamu

(||ghanu||)
jāṟum̐jĕmaḍalamĕyi sarulamutyālu sūsi
sīṟumutyā lŏligĕ nīsĕlasĕkkula
tīṟuḍaddā levūru tīgĕsoga yevūru
āṟaḍi nŏkkaḍŏgaḍi kaṁṭunā guṇamu

(||ghanu||)
kaḍum̐ jaṁdrābharaṇālu karamulam̐ jūsi nīgu
paḍam̐tigusāla saṁdrābharaṇā laṁṭĕ
baḍim̐ dūṁḍlevūru payim̐ḍiguṁḍa levūru
aḍari śhrīveṁkaḍeśha aṁṭunā guṇamu