ఘనుఁడ నీ నేరుపులు కనే మిందులోననే
(॥పల్లవి॥)
ఘనుఁడ నీ నేరుపులు కనే మిందులోననే
పనిమాలినపని పంతము లేలాడేవు
(॥॥)
తెరమఱఁగున నుండే తేనెలమాటలాడీ
ఇరవై యెదుట నెంత యెలయించునో
తరుణి తరితీపులఁ దగులకుండేవా నీవు
యెరవుల నీమనసు యెట్టున్నదో
(॥॥)
మోము వంచుకొని వుండే ముత్యపునవ్వులు నవ్వీ
సాము సేసితే నీకెంత చవిరేఁచునో
భామవిలాసములకు భ్రమయకుండేవా నీవు
నీమహిమ దెలియదు నెట్టుకొనె వలపు
(॥॥)
కాఁగిలించుకొని వుండే కరఁగించీ నిక్కువలు
మాఁగినమోవిస్తే నీమర్మ మెట్టుంటునో
చేఁగదేరి యాపె నన్ను శ్రీ వేంకటేశ యేలితి
దాఁగదు నీతమకము తతి చెప్పఁ గొత్తలు
(||pallavi||)
ghanum̐ḍa nī nerubulu kane miṁdulonane
panimālinabani paṁtamu lelāḍevu
(||||)
tĕramaṟam̐guna nuṁḍe tenĕlamāḍalāḍī
iravai yĕduḍa nĕṁta yĕlayiṁchuno
taruṇi taridībulam̐ dagulaguṁḍevā nīvu
yĕravula nīmanasu yĕṭṭunnado
(||||)
momu vaṁchugŏni vuṁḍe mutyabunavvulu navvī
sāmu seside nīgĕṁta savirem̐suno
bhāmavilāsamulagu bhramayaguṁḍevā nīvu
nīmahima dĕliyadu nĕṭṭugŏnĕ valabu
(||||)
kām̐giliṁchugŏni vuṁḍe karam̐giṁchī nikkuvalu
mām̐ginamoviste nīmarma mĕṭṭuṁṭuno
sem̐gaderi yābĕ nannu śhrī veṁkaḍeśha yelidi
dām̐gadu nīdamagamu tadi sĕppam̐ gŏttalu