Ghanum dannidaam daanu kamti tanagunamellaa

ఘనుఁ డన్నిటాఁ దాను కంటి తనగుణమెల్లా
Language

(॥పల్లవి॥)
ఘనుఁ డన్నిటాఁ దాను కంటి తనగుణమెల్లా
మునుపనే పాదాలకు మొక్కితి నే ననవే

(॥ఘను॥)
సరసము తా నాడుటే చనవిచ్చినట్టుగాదా
శిరసు వంచుకొంటేనే చేకొంటగాదా
తెరవేయిమంటేనే వద్దికిఁ బిలుచుటగాదా
యిరవాయఁ దనమేలు యేల చెప్పీ నాకును

(॥ఘను॥)
మాటలు తా నాడితేనే మచ్చిక చల్లుటగాదా
చోటిచ్చినదే వలపు చూపుటగాదా
నాటఁగా మోముచూచుటే నమ్మిక లిచ్చుటగాదా
వాంటముగా తనపొందు వాసిపంపు నేఁటికే

(॥ఘను॥)
మెచ్చి కాఁగిలించితేనే మించి కలయుటగాదా
ఇచ్చగించుటే రతికి నెరుకగాదా
యిచ్చట శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
తచ్చి నన్నుఁ గూడె నింకాఁ దలఁపించవలెనా

(||pallavi||)
ghanum̐ ḍanniḍām̐ dānu kaṁṭi tanaguṇamĕllā
munubane pādālagu mŏkkidi ne nanave

(||ghanu||)
sarasamu tā nāḍuḍe sanavichchinaṭṭugādā
śhirasu vaṁchugŏṁṭene segŏṁṭagādā
tĕraveyimaṁṭene vaddigim̐ bilusuḍagādā
yiravāyam̐ danamelu yela sĕppī nāgunu

(||ghanu||)
māḍalu tā nāḍidene machchiga salluḍagādā
soḍichchinade valabu sūbuḍagādā
nāḍam̐gā momusūsuḍe nammiga lichchuḍagādā
vāṁṭamugā tanabŏṁdu vāsibaṁpu nem̐ṭige

(||ghanu||)
mĕchchi kām̐giliṁchidene miṁchi kalayuḍagādā
ichchagiṁchuḍe radigi nĕrugagādā
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
tachchi nannum̐ gūḍĕ niṁkām̐ dalam̐piṁchavalĕnā