ఘనుఁ డాతఁడేమన్నాఁ గాదందురా
(॥పల్లవి॥)
ఘనుఁ డాతఁడేమన్నాఁ గాదందురా
వెనకటి సుద్దులేల వేవేలైనాను
(॥ఘను॥)
సిగ్గుదేరనాతఁడు చెయి నీపై వేసితేను
యెగ్గులుఁ దప్పులు వట్టేవేలే యింత
వుగ్గడించి యాతఁడు వొంటి నిన్నుఁ బొగడఁగ
అగ్గలమై వాదడిచేవవునే నీవు
(॥ఘను॥)
చనవిచ్చి యాతఁడు సరసములాడఁగాను
పెనఁగేవు సారెసారెఁ బెద్దరికమా
మనసు గలయ నీతో మాటలిట్టె యాడఁగాను
వినియు వినవు యీవిదమేలే నీకు
(॥ఘను॥)
అడరి శ్రీవేంకటేశుఁడట్టె నిన్నుఁ గూడఁగాను
చిడుముడి వడి నవ్వఁ జెల్లునే నీకు
బడిబడి నీకతఁడు పంతములియ్యఁగాను
జడిసి కన్నుబొమ్మల జంకించనేఁటికే
(||pallavi||)
ghanum̐ ḍādam̐ḍemannām̐ gādaṁdurā
vĕnagaḍi suddulela vevelainānu
(||ghanu||)
sigguderanādam̐ḍu sĕyi nībai vesidenu
yĕggulum̐ dappulu vaṭṭevele yiṁta
vuggaḍiṁchi yādam̐ḍu vŏṁṭi ninnum̐ bŏgaḍam̐ga
aggalamai vādaḍisevavune nīvu
(||ghanu||)
sanavichchi yādam̐ḍu sarasamulāḍam̐gānu
pĕnam̐gevu sārĕsārĕm̐ bĕddarigamā
manasu galaya nīdo māḍaliṭṭĕ yāḍam̐gānu
viniyu vinavu yīvidamele nīgu
(||ghanu||)
aḍari śhrīveṁkaḍeśhum̐ḍaṭṭĕ ninnum̐ gūḍam̐gānu
siḍumuḍi vaḍi navvam̐ jĕllune nīgu
baḍibaḍi nīgadam̐ḍu paṁtamuliyyam̐gānu
jaḍisi kannubŏmmala jaṁkiṁchanem̐ṭige