ఘనసుఖము జీవుఁ డెఱుఁగఁడు గాక యెఱిఁగినను
(॥పల్లవి॥)
ఘనసుఖము జీవుఁ డెఱుఁగఁడు గాక యెఱిఁగినను
అనవరతవిభవంబు లప్పుడే రావా
(॥ఘన॥)
విసుగ కెవ్వరినైన వేఁడ నేర్చిననోరు
దెసలకునుఁ బలుమారుఁ దెరచునోరు
వసుధాకళత్రుఁ దడవదుగాక తడవినను
యెఁసఁగఁ గోరికలు తన కిప్పుడే రావా
(॥ఘన॥)
ముద మంది యెవ్వరికి మొక్క నేర్చినచేయి
పొదిగి యధముల నడుగఁ బూనుచేయి
ఆదన హరిఁ బూజసేయదు గాక సేసినను
యెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా
(॥ఘన॥)
తడయ కేమిటికైనఁ దమక మందెడిమనసు
అడియాస కోరికల నలయు మనసు
వడి వేంకటేశుఁ గొలువదు గాక కొలిచినను
బడిబడినే చెడనిసంపద లిట్లు రావా
(||pallavi||)
ghanasukhamu jīvum̐ ḍĕṟum̐gam̐ḍu gāga yĕṟim̐ginanu
anavaradavibhavaṁbu lappuḍe rāvā
(||ghana||)
visuga kĕvvarinaina vem̐ḍa nersinanoru
dĕsalagunum̐ balumārum̐ dĕrasunoru
vasudhāgaḽatrum̐ daḍavadugāga taḍavinanu
yĕm̐sam̐gam̐ gorigalu tana kippuḍe rāvā
(||ghana||)
muda maṁdi yĕvvarigi mŏkka nersinaseyi
pŏdigi yadhamula naḍugam̐ būnuseyi
ādana harim̐ būjaseyadu gāga sesinanu
yĕdurĕduram̐ gorigalu yippuḍe rāvā
(||ghana||)
taḍaya kemiḍigainam̐ damaga maṁdĕḍimanasu
aḍiyāsa korigala nalayu manasu
vaḍi veṁkaḍeśhum̐ gŏluvadu gāga kŏlisinanu
baḍibaḍine sĕḍanisaṁpada liṭlu rāvā