ఘన సంసారులకెల్ల కర్మమై పొడచూపు
(॥పల్లవి॥)
ఘన సంసారులకెల్ల కర్మమై పొడచూపు
ననిచి యింతకు గురి నరహరి వొక్కఁడు
(॥ఘన॥)
యెలమిఁ బుణ్యము లెల్ల యింద్రలోకమై తోఁచు
నలుఁడ పాపములే నరకలోకమై తోఁచు
పొలసి రెండు సరియైతే భూలోకమై తోఁచు
కలవాఁ డొక్కఁడే గుఱి కమలావిభుఁడు
(॥ఘన॥)
పరగ రాజసులకు బ్రహ్మయై పొడచూపు
గరిమ తామసులకు కఱకంఠుడై యుండు
సిరుల సాత్వికులకు శ్రీకాంతుఁడై మించు
నిరవైనవాఁడు శ్రీహరి యొక్కఁడే
(॥ఘన॥)
ఆయమెఱిఁగినవారి కంతరాత్మయై యుండు
చాయ గన్నవారికి జగమెల్ల నై తోఁచు
చేయ గన్నవారికి శ్రీ వేంకటేశుఁడై తోఁచు
యేయెడ వారికి యీదేవుఁ డొక్కఁడే
(||pallavi||)
ghana saṁsārulagĕlla karmamai pŏḍasūbu
nanisi yiṁtagu guri narahari vŏkkam̐ḍu
(||ghana||)
yĕlamim̐ buṇyamu lĕlla yiṁdralogamai tom̐su
nalum̐ḍa pābamule naragalogamai tom̐su
pŏlasi rĕṁḍu sariyaide bhūlogamai tom̐su
kalavām̐ ḍŏkkam̐ḍe guṟi kamalāvibhum̐ḍu
(||ghana||)
paraga rājasulagu brahmayai pŏḍasūbu
garima tāmasulagu kaṟagaṁṭhuḍai yuṁḍu
sirula sātvigulagu śhrīgāṁtum̐ḍai miṁchu
niravainavām̐ḍu śhrīhari yŏkkam̐ḍe
(||ghana||)
āyamĕṟim̐ginavāri kaṁtarātmayai yuṁḍu
sāya gannavārigi jagamĕlla nai tom̐su
seya gannavārigi śhrī veṁkaḍeśhum̐ḍai tom̐su
yeyĕḍa vārigi yīdevum̐ ḍŏkkam̐ḍe