Ghaadalu neebaim joobadu kannebadusu ganaga

ఘాతలు నీపైఁ జూపదు కన్నెపడుచు గనక
Language

(॥పల్లవి॥)
ఘాతలు నీపైఁ జూపదు కన్నెపడుచు గనక
చూతము నీ నేరుపులు చూపరాదా మేలు

(॥పశిత॥)
చిలుకచే మాటాడించి సిగ్గుతోడ నున్నదిదే
పలికించరాదా నీపంతమీడేర
కలువపువ్వుల వేసి కాంత నిలుచున్నదిదే
మొలకచన్నులమీఁద మోపరాదా చెయ్యి

(॥పశిత॥)
యెదురుగా హంస నంపి ఇంటిలోన నున్న దిదే
కదిసి మన్నించరాదా ఘనత మీర
గుదిగొన సేసచల్లి గుట్టుతోడ నున్నదిదే
పొదిగి మేననెల్లాఁ బూయరాదా గందము

(॥పశిత॥)
పావురాలఁ గానుకిచ్చి పడఁతి కాఁగిటఁ గూడె
సేవలు మెచ్చి కలికిఁ జేయరాదా
శ్రీవేంకటేశ్వర యీకె చెలరేఁగి యున్నదిదే
యీవేళ నలపుదేర నియ్యరాదా విడెము

(||pallavi||)
ghādalu nībaim̐ jūbadu kannĕbaḍusu ganaga
sūdamu nī nerubulu sūbarādā melu

(||paśhida||)
silugase māḍāḍiṁchi siggudoḍa nunnadide
paligiṁcharādā nībaṁtamīḍera
kaluvabuvvula vesi kāṁta nilusunnadide
mŏlagasannulamīm̐da mobarādā sĕyyi

(||paśhida||)
yĕdurugā haṁsa naṁpi iṁṭilona nunna dide
kadisi manniṁcharādā ghanada mīra
gudigŏna sesasalli guṭṭudoḍa nunnadide
pŏdigi menanĕllām̐ būyarādā gaṁdamu

(||paśhida||)
pāvurālam̐ gānugichchi paḍam̐ti kām̐giḍam̐ gūḍĕ
sevalu mĕchchi kaligim̐ jeyarādā
śhrīveṁkaḍeśhvara yīgĕ sĕlarem̐gi yunnadide
yīveḽa nalabudera niyyarādā viḍĕmu