Ghaada nalubum delubu kannulamde nomtenada

ఘాత నలుపుఁ దెలుపు కన్నులందె నొంటెనట
Language

(॥పల్లవి॥)
ఘాత నలుపుఁ దెలుపు కన్నులందె నొంటెనట
ఆతని నీ సంది కోపా లంతకంటేనా

(॥ఘాత॥)
సతి నీమోమున నదే సంపెంగతావి వలిచీ
మితిమీరె కురులతుమ్మిదలు నందె
అతివైరమును శాంత మందులో నోరిచితివి
పతితో నేఁటికి నింకఁ బలుకవే నీవు

(॥ఘాత॥)
చెలి నీనడుమ నదే సింహము పోలికలాయ
కలసెఁ బాదాల గజగమన మందే
చలువకు వేఁడికి సరి నం దోరిచితివి
చలము సాదించి పతి జంకించ నేఁటికినే

(॥ఘాత॥)
జక్కవలే కుచములు చందురుఁడే నీమోము
వొక్కటొక్కటి వైరము లోరిచితివి
యెక్కువ శ్రీవేంకటేశు నిదెఱిఁగే కూడితివి
వొక్కటై చెక్కునొక్కఁగ వొద్దన నేఁటికినే

(||pallavi||)
ghāda nalubum̐ dĕlubu kannulaṁdĕ nŏṁṭĕnaḍa
ādani nī saṁdi kobā laṁtagaṁṭenā

(||ghāda||)
sadi nīmomuna nade saṁpĕṁgadāvi valisī
midimīrĕ kuruladummidalu naṁdĕ
adivairamunu śhāṁta maṁdulo norisidivi
padido nem̐ṭigi niṁkam̐ balugave nīvu

(||ghāda||)
sĕli nīnaḍuma nade siṁhamu poligalāya
kalasĕm̐ bādāla gajagamana maṁde
saluvagu vem̐ḍigi sari naṁ dorisidivi
salamu sādiṁchi padi jaṁkiṁcha nem̐ṭigine

(||ghāda||)
jakkavale kusamulu saṁdurum̐ḍe nīmomu
vŏkkaḍŏkkaḍi vairamu lorisidivi
yĕkkuva śhrīveṁkaḍeśhu nidĕṟim̐ge kūḍidivi
vŏkkaḍai sĕkkunŏkkam̐ga vŏddana nem̐ṭigine