Gelisidi bhavamula gelisidim gaamaadula

గెలిచితి భవముల గెలిచితిఁ గామాదుల
Language

(॥పల్లవి॥)
గెలిచితి భవముల గెలిచితిఁ గామాదుల
యిల నీ వేలికవైతి వింక నేడ వెఱపు

(॥గెలిచి॥)
హరి నీకు నే దాసుఁడ ననే దొక సలిగ
వొరసి యచ్చు మోచిన దొక సలిగ
అరయఁ బ్రసాదజీవి ననేటి దొక సలిగ
యిరవాయ నన్నిటా నా కింక నేడ వెఱపు

(॥గెలిచి॥)
అట్టే నాలోన నున్నాఁడవనేటి దొక బలిమి
వొట్టి నిన్నుఁ బాడేటి దొక బలిమి
గట్టిగా నీ భాగవతకరుణ యొక్క బలిమి
యెట్టు నే నేమి సేసినా యింక నేడ వెఱపు

(॥గెలిచి॥)
వొట్టి నీవే గతి యని వుండే నేమ మొక్క దాపు
వుప్పతిల్లు నీపై భక్తి వొక్క దాపు
నెప్పున శ్రీవేంకటేశ నీ సేవ లొక దాపు
యెప్పుడు నీవే దిక్కు యింక నేడ వెఱపు

(||pallavi||)
gĕlisidi bhavamula gĕlisidim̐ gāmādula
yila nī veligavaidi viṁka neḍa vĕṟabu

(||gĕlisi||)
hari nīgu ne dāsum̐ḍa nane dŏga saliga
vŏrasi yachchu mosina dŏga saliga
arayam̐ brasādajīvi naneḍi dŏga saliga
yiravāya nanniḍā nā kiṁka neḍa vĕṟabu

(||gĕlisi||)
aṭṭe nālona nunnām̐ḍavaneḍi dŏga balimi
vŏṭṭi ninnum̐ bāḍeḍi dŏga balimi
gaṭṭigā nī bhāgavadagaruṇa yŏkka balimi
yĕṭṭu ne nemi sesinā yiṁka neḍa vĕṟabu

(||gĕlisi||)
vŏṭṭi nīve gadi yani vuṁḍe nema mŏkka dābu
vuppadillu nībai bhakti vŏkka dābu
nĕppuna śhrīveṁkaḍeśha nī seva lŏga dābu
yĕppuḍu nīve dikku yiṁka neḍa vĕṟabu