గయ్యాళితనము నేర ఘనుఁడు నీ విన్నిటా
(॥పల్లవి॥)
గయ్యాళితనము నేర ఘనుఁడు నీ విన్నిటా
నెయ్యములు చూపి మాపై నేరుపులు చల్లుమీ
(॥గయ్యా॥)
ముసి ముసి నవ్వులతో ముందర నిలుచుందాన
యెసగి యేమానాఁ జేయు మిప్పుడు నీవు
వసముగాక నీతో వాదులడువఁగ లేదు
పస ఇంతే కలది నాపడఁతి తనమున
(॥గయ్యా॥)
చిఱుజెమటలతోడ చేయివట్టుకున్నదాన
యెఱిఁగి పాలిచ్చుకొమ్ము ఇప్పుడు నీవు
మఱఁగులదానఁ గాను మాట ఇంతేసాడనోప
గుఱి ఇదె కలది నాగుణములోపలను
(॥గయ్యా॥)
తూలని ఆసలతోడ తొడమీఁద నున్నదాన
యీలీలఁ గలసితివి ఇప్పుడు నీవు
ఆలరితనము నేర అన్నిటా శ్రీ వేంకటేశ
వేళ యిదె నీకు నాకు విన్నవించుకొనను
(||pallavi||)
gayyāḽidanamu nera ghanum̐ḍu nī vinniḍā
nĕyyamulu sūbi mābai nerubulu sallumī
(||gayyā||)
musi musi navvulado muṁdara nilusuṁdāna
yĕsagi yemānām̐ jeyu mippuḍu nīvu
vasamugāga nīdo vādulaḍuvam̐ga ledu
pasa iṁte kaladi nābaḍam̐ti tanamuna
(||gayyā||)
siṟujĕmaḍaladoḍa seyivaṭṭugunnadāna
yĕṟim̐gi pālichchugŏmmu ippuḍu nīvu
maṟam̐guladānam̐ gānu māḍa iṁtesāḍanoba
guṟi idĕ kaladi nāguṇamulobalanu
(||gayyā||)
tūlani āsaladoḍa tŏḍamīm̐da nunnadāna
yīlīlam̐ galasidivi ippuḍu nīvu
ālaridanamu nera anniḍā śhrī veṁkaḍeśha
veḽa yidĕ nīgu nāgu vinnaviṁchugŏnanu