గయ్యాళితనము నాది కడుశాంతము నీది
(॥పల్లవి॥)
గయ్యాళితనము నాది కడుశాంతము నీది
ఇయ్యెడ నీమంచితన మేమని పొగడుదు
(॥॥)
మిక్కిలిదొరవు నీవు మేనదాననంటా నేను
చిక్కఁగా నవ్వితిని సెలవులను
మక్కువతో నందుకును మన్నించితివి నన్ను
యెక్కువ నీగుణములు యేమని పొగడుదు
(॥॥)
అన్నిటా జాణవు నీవు ఆలనైతినంటా నేను
కన్నుల జంకించితిఁ గాఁతాళానను
వున్నతి నూరకే మెచ్చి వుంగర మెఁసగితివి
యెన్నికైన నీకరుణ కేమనిపొగడుదు
(॥॥)
గుట్టుతోవాఁడవు నీవు కూడితివంటా నేను
రట్టు సేసితివి మోవి నెట్టున నిన్ను
జట్టిగా శ్రీ వేంకటేశ చనవిచ్చితివి నాకు
యిట్టె సేసిననీ మేలు కేమని పొగడుదు
(||pallavi||)
gayyāḽidanamu nādi kaḍuśhāṁtamu nīdi
iyyĕḍa nīmaṁchidana memani pŏgaḍudu
(||||)
mikkilidŏravu nīvu menadānanaṁṭā nenu
sikkam̐gā navvidini sĕlavulanu
makkuvado naṁdugunu manniṁchidivi nannu
yĕkkuva nīguṇamulu yemani pŏgaḍudu
(||||)
anniḍā jāṇavu nīvu ālanaidinaṁṭā nenu
kannula jaṁkiṁchidim̐ gām̐tāḽānanu
vunnadi nūrage mĕchchi vuṁgara mĕm̐sagidivi
yĕnnigaina nīgaruṇa kemanibŏgaḍudu
(||||)
guṭṭudovām̐ḍavu nīvu kūḍidivaṁṭā nenu
raṭṭu sesidivi movi nĕṭṭuna ninnu
jaṭṭigā śhrī veṁkaḍeśha sanavichchidivi nāgu
yiṭṭĕ sesinanī melu kemani pŏgaḍudu