Garime nerimgigomdu gaani naa vinnabamu

గరిమె నెరిఁగికొందు గాని నా విన్నపము
Language

(॥పల్లవి॥)
గరిమె నెరిఁగికొందు గాని నా విన్నపము
విరహానఁ బొంది నన్ను వేసరించఁ జుమ్మీ

(॥గరి॥)
కావరించి పడ నోప కాంతల దూరా నొల్ల
నీవారమై నేము నిండుకుండేము
యేవేళ నీకితవాయ నింటి కిట్టె విచ్చేయు
కావించి నాయంత నిన్నుఁగస్తిఁ బెట్టఁ జుమ్మీ

(॥గరి॥)
వంతువాసు లడుగును వచ్చి వచ్చి యలుగను
వింతగా నీమేలెల్లా వినుచుండేము
అంత నాతో పొందు తగవై తేనే చేకొను
పంతాన వట్టిచనవు పచరించఁ జుమ్మి

(॥గరి॥)
మేర మీర నీయడకు మేనవావిఁ బెనఁగను
వోరిచి నీవలపుల నోలలాడేము
యీ రీతి శ్రీవేంకటేశ యింతలో నన్నుఁగూడితి-
వారయ నిన్ను నిఁక నలయించఁ జుమ్మీ

(||pallavi||)
garimĕ nĕrim̐gigŏṁdu gāni nā vinnabamu
virahānam̐ bŏṁdi nannu vesariṁcham̐ jummī

(||gari||)
kāvariṁchi paḍa noba kāṁtala dūrā nŏlla
nīvāramai nemu niṁḍuguṁḍemu
yeveḽa nīgidavāya niṁṭi kiṭṭĕ vichcheyu
kāviṁchi nāyaṁta ninnum̐gastim̐ bĕṭṭam̐ jummī

(||gari||)
vaṁtuvāsu laḍugunu vachchi vachchi yaluganu
viṁtagā nīmelĕllā vinusuṁḍemu
aṁta nādo pŏṁdu tagavai tene segŏnu
paṁtāna vaṭṭisanavu pasariṁcham̐ jummi

(||gari||)
mera mīra nīyaḍagu menavāvim̐ bĕnam̐ganu
vorisi nīvalabula nolalāḍemu
yī rīdi śhrīveṁkaḍeśha yiṁtalo nannum̐gūḍidi-
vāraya ninnu nim̐ka nalayiṁcham̐ jummī