గరిమ మీవేళ మీరు కాచుకున్నారు
(॥పల్లవి॥)
గరిమ మీవేళ మీరు కాచుకున్నారు
యిరవాయ వలపులు యేమి సేతురయ్యా
(॥గరి॥)
పడఁతి యిచ్చకురాలు పైకొనీ నీకెప్పుడును
కడలేని నీవైతే కాతరీఁడవు
బడి బడి నిద్దరును పాయరాని బందుగులు
యెడపుల సతులెల్లా నేమిసేతురయ్యా
(॥గరి॥)
నెలఁత నీకు మేలుది నేమముతో నున్నది
నలి నీవైతే ప్రాణనాథఁ
పొలసి మీకిద్దరికి పోరాని నేస్తాలు
యెలమి సంగడికాంత లేమిసేతురయ్యా
(॥గరి॥)
శ్రీమహాలక్ష్మీ యీకె జిగి నీవురమెక్కెను
నేనుపు శ్రీవేంకటేశ నీవు పతివి
ప్రేమాన మీ కిద్దరికి పెండ్లిసోబనము
యీ మగువలునుఁ గూడి రేమిసేతురయ్యా
(||pallavi||)
garima mīveḽa mīru kāsugunnāru
yiravāya valabulu yemi sedurayyā
(||gari||)
paḍam̐ti yichchagurālu paigŏnī nīgĕppuḍunu
kaḍaleni nīvaide kādarīm̐ḍavu
baḍi baḍi niddarunu pāyarāni baṁdugulu
yĕḍabula sadulĕllā nemisedurayyā
(||gari||)
nĕlam̐ta nīgu meludi nemamudo nunnadi
nali nīvaide prāṇanātham̐
pŏlasi mīgiddarigi porāni nestālu
yĕlami saṁgaḍigāṁta lemisedurayyā
(||gari||)
śhrīmahālakṣhmī yīgĕ jigi nīvuramĕkkĕnu
nenubu śhrīveṁkaḍeśha nīvu padivi
premāna mī kiddarigi pĕṁḍlisobanamu
yī maguvalunum̐ gūḍi remisedurayyā