Gamdamamdugovayya kaligi nee kosamgeeni

గందమందుకోవయ్య కలికి నీ కొసఁగీని
Language

(॥పల్లవి॥)
గందమందుకోవయ్య కలికి నీ కొసఁగీని
అందుకునందుకే సరి అధికము వలపు

(॥గంద॥)
దవ్వుల నుండిన పతి దగ్గరి వచ్చినప్పుడు
రవ్వలైన కోపము రాకుండదు
నవ్వులునుఁ దోడనే నయములు చూపకుండదు
యెవ్వరికి నిందుకుగా నెగ్గులేల యెంచను

(॥గంద॥)
తలవంచు కొన్నవాఁడు తప్పకచూచితేను
మొలకపంతాలు గడుమోవకుండవు
అలరి అంతటిలోనే ఆసలు రేగకుండవు
చలము లిందుకుగాను సాదించనేటికి

(॥గంద॥)
మెడఁగట్టుకొన్నవాడు మేలములాడితేను
అడియాలములు మేన నంటకుండవు
అడరి శ్రీవేంకటేశ ఆపె యలమేలుమంగ
వొడికమై కూడితిరి వోరించనేటికి

(||pallavi||)
gaṁdamaṁdugovayya kaligi nī kŏsam̐gīni
aṁdugunaṁduge sari adhigamu valabu

(||gaṁda||)
davvula nuṁḍina padi daggari vachchinappuḍu
ravvalaina kobamu rāguṁḍadu
navvulunum̐ doḍane nayamulu sūbaguṁḍadu
yĕvvarigi niṁdugugā nĕggulela yĕṁchanu

(||gaṁda||)
talavaṁchu kŏnnavām̐ḍu tappagasūsidenu
mŏlagabaṁtālu gaḍumovaguṁḍavu
alari aṁtaḍilone āsalu regaguṁḍavu
salamu liṁdugugānu sādiṁchaneḍigi

(||gaṁda||)
mĕḍam̐gaṭṭugŏnnavāḍu melamulāḍidenu
aḍiyālamulu mena naṁṭaguṁḍavu
aḍari śhrīveṁkaḍeśha ābĕ yalamelumaṁga
vŏḍigamai kūḍidiri voriṁchaneḍigi