గక్కున నింట లేనిది గానుగకాడ నున్నదా
(॥పల్లవి॥)
గక్కున నింట లేనిది గానుగకాడ నున్నదా
నక్కువడ నిందుకే పో నవ్వితి నే ననరే
(॥॥)
తా నేడనుండిన నేమి తలఁ పొక్కటైనఁ జాలు
ఆనలు సత్యాలఁ జెప్పి యంపవలెనా
దానికే మెదురుమాట తనతో నే నాడేనా
మోనాన నిట్టె తనకు మొక్కితి నే ననరే
(॥॥)
యేదిక్కు చూచిననేమి యీడకు విచ్చేసెఁ జాలు
యీదెస నొడఁబరచ నింతవలెనా
కాదని తనచేఁతలు ఖండించఁజెల్లునా
వాదు లడువక తలవంచితి నే ననరే
(॥॥)
అసురుసు రై తేనేమి అట్టె నన్నుఁ గూడెఁ జాలు
వసమై నాకిఁక వెరవఁగవలెనా
యెసఁగి శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్ను మన్నించె
రసికుఁడు తాను నారపమాయ ననరే
(||pallavi||)
gakkuna niṁṭa lenidi gānugagāḍa nunnadā
nakkuvaḍa niṁduge po navvidi ne nanare
(||||)
tā neḍanuṁḍina nemi talam̐ pŏkkaḍainam̐ jālu
ānalu satyālam̐ jĕppi yaṁpavalĕnā
dānige mĕdurumāḍa tanado ne nāḍenā
monāna niṭṭĕ tanagu mŏkkidi ne nanare
(||||)
yedikku sūsinanemi yīḍagu vichchesĕm̐ jālu
yīdĕsa nŏḍam̐barasa niṁtavalĕnā
kādani tanasem̐talu khaṁḍiṁcham̐jĕllunā
vādu laḍuvaga talavaṁchidi ne nanare
(||||)
asurusu rai tenemi aṭṭĕ nannum̐ gūḍĕm̐ jālu
vasamai nāgim̐ka vĕravam̐gavalĕnā
yĕsam̐gi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannu manniṁchĕ
rasigum̐ḍu tānu nārabamāya nanare