Gakkana niddarum galayudivi

గక్కన నిద్దరుఁ గలయుటివి
Language

(॥పల్లవి॥)
గక్కన నిద్దరుఁ గలయుటివి
మక్కువ మా యెడమాఁట లిఁకేలా

(॥॥)
పాదపువాఁతలు భావపుటీఁతలు
ఆదెసఁ జెలికిని యాసలఁబో
మోదపుఁ బలుకులు ముంచినపులకలు
యీదెస నీకును యిక్కడఁ గలిగె

(॥॥)
కన్నులకెంపులు కాఁకలసొంపులు
వన్నెలసతికిని వలపునఁబో
సన్నపుఁజెమరులు సరసపుతిమురులు
నిన్న నేఁటనే నీకును గలిగె

(॥॥)
పైపైనుసురులు పయ్యదవిసరులు
నీపొందు చెలికి నిలువఁగఁబో
యేపున శ్రీ వేంకటేశ్వర నీకును
యాపడఁతికూట మింతలోఁ గలిగె

(||pallavi||)
gakkana niddarum̐ galayuḍivi
makkuva mā yĕḍamām̐ṭa lim̐kelā

(||||)
pādabuvām̐talu bhāvabuḍīm̐talu
ādĕsam̐ jĕligini yāsalam̐bo
modabum̐ balugulu muṁchinabulagalu
yīdĕsa nīgunu yikkaḍam̐ galigĕ

(||||)
kannulagĕṁpulu kām̐kalasŏṁpulu
vannĕlasadigini valabunam̐bo
sannabum̐jĕmarulu sarasabudimurulu
ninna nem̐ṭane nīgunu galigĕ

(||||)
paibainusurulu payyadavisarulu
nībŏṁdu sĕligi niluvam̐gam̐bo
yebuna śhrī veṁkaḍeśhvara nīgunu
yābaḍam̐tigūḍa miṁtalom̐ galigĕ