గజరున నంతా నేల కలయఁబెట్టుకొనేవు
(॥పల్లవి॥)
గజరున నంతా నేల కలయఁబెట్టుకొనేవు
గుజగుజతో నవ్వుకొంటా నుండరాదా
(॥గజ॥)
ఇంతితోనే మాటాడితే నేల పూనుకవచ్చేవు
సంతసతులెల్లా నీకు సమమేకాదా
పంతపు సవతులము పడితళించుకొంటేను
కొంతగొంత నీవు నవ్వుకొంటా నుండరాదా
(॥గజ॥)
నెలఁతఁ దప్పువట్టితే నీవేల దిద్దవచ్చేవు
సళువుగొల్లెత లింతా సరియేకాదా
వలపుదొడ్డివారము వంతువాసు లెంచుకొంటే
కులికి నీవు నవ్వుకొంటా నుండరాదా
(॥గజ॥)
అంగన నే సాదించితే ఆకెనేల మొక్కించేవు
జంగిలివారెల్లా నీకు సరియే కదా
యెంగిలి శ్రీవేంకటేశ యే నలమేల్మంగను
కుంగక కూడితి నవ్వుకొంటా నుండరాదా
(||pallavi||)
gajaruna naṁtā nela kalayam̐bĕṭṭugŏnevu
gujagujado navvugŏṁṭā nuṁḍarādā
(||gaja||)
iṁtidone māḍāḍide nela pūnugavachchevu
saṁtasadulĕllā nīgu samamegādā
paṁtabu savadulamu paḍidaḽiṁchugŏṁṭenu
kŏṁtagŏṁta nīvu navvugŏṁṭā nuṁḍarādā
(||gaja||)
nĕlam̐tam̐ dappuvaṭṭide nīvela diddavachchevu
saḽuvugŏllĕda liṁtā sariyegādā
valabudŏḍḍivāramu vaṁtuvāsu lĕṁchugŏṁṭe
kuligi nīvu navvugŏṁṭā nuṁḍarādā
(||gaja||)
aṁgana ne sādiṁchide āgĕnela mŏkkiṁchevu
jaṁgilivārĕllā nīgu sariye kadā
yĕṁgili śhrīveṁkaḍeśha ye nalamelmaṁganu
kuṁgaga kūḍidi navvugŏṁṭā nuṁḍarādā