గడుసవు గదె నీవు కలికీ । వోరి
(॥పల్లవి॥)
గడుసవు గదె నీవు కలికీ । వోరి
అడరి మరుని మహి మటువంటిదౌరా
(॥గడు॥)
తప్పకచూచేవేమే తరుణీ వోరి
కుప్పించీ నీమీఁదను చకోరాలురా
చిప్పిల నామేనెల్లాఁ జెమరించెనే వోరి
యెప్పుడూ వాఁటిగుణాలు ఇటువంటివౌరా
(॥గడు॥)
వొఱపులే నీచన్ను లువిదా వోరి
యెఱసీ జక్కవలు నీమీఁదనుండిరా
మఱి కరఁగేఁగదవే మగువా వోరి
యెఱఁగనా వాఁటివోజ లిటువంటివౌరా
(॥గడు॥)
మించి వురమెక్కే వలమేలుమంగా వోరి
యంచలు నీయందు వోలలాడఁజొచ్చెరా
యెంచఁగల శ్రీవేంకటేశుఁడఁగదే వోరి
వంచనతోఁ గూడితివి నానిజాడలౌరా
(||pallavi||)
gaḍusavu gadĕ nīvu kaligī | vori
aḍari maruni mahi maḍuvaṁṭidaurā
(||gaḍu||)
tappagasūseveme taruṇī vori
kuppiṁchī nīmīm̐danu sagorālurā
sippila nāmenĕllām̐ jĕmariṁchĕne vori
yĕppuḍū vām̐ṭiguṇālu iḍuvaṁṭivaurā
(||gaḍu||)
vŏṟabule nīsannu luvidā vori
yĕṟasī jakkavalu nīmīm̐danuṁḍirā
maṟi karam̐gem̐gadave maguvā vori
yĕṟam̐ganā vām̐ṭivoja liḍuvaṁṭivaurā
(||gaḍu||)
miṁchi vuramĕkke valamelumaṁgā vori
yaṁchalu nīyaṁdu volalāḍam̐jŏchchĕrā
yĕṁcham̐gala śhrīveṁkaḍeśhum̐ḍam̐gade vori
vaṁchanadom̐ gūḍidivi nānijāḍalaurā