Gaddemeemda numdaanavu kaampuramu sesevu

గద్దెమీఁద నుందానవు కాఁపురము సేసేవు
Language

(॥పల్లవి॥)
గద్దెమీఁద నుందానవు కాఁపురము సేసేవు
పెద్దరికము చూపక పిరితీసేవా

(॥॥)
సేవచేసేదానవు చేరి నవ్వేదానవు
నీవేకా ఆతనికి నేరుపుతోడ
చేవదేరి వుందానవు సిగ్గులెల్లా నారితేరి
మావంటిసవతుల మదిఁ దలచేవా

(॥॥)
యేకతమాడేదానవు ఇంపు చల్లేదానవు
జోకతోడ నీవేకా చుట్టమవు
చేకొని నీకిన్నిటాను చెల్లుబడి గలిగెను
దీకొని నీతోడివారిదిక్కు చూచేవా

(॥॥)
కలిసినదానవు కందువ నున్న దానవు
ఇల నీవేకా యితని ఇంపుదానవు
యెలమి శ్రీవేంకటేశుఁ డితఁడే మమ్మెల్ల నేలె
నెలవై నీచెల్లెండ్ల మన్నించక మానేవా

(||pallavi||)
gaddĕmīm̐da nuṁdānavu kām̐puramu sesevu
pĕddarigamu sūbaga piridīsevā

(||||)
sevasesedānavu seri navvedānavu
nīvegā ādanigi nerubudoḍa
sevaderi vuṁdānavu siggulĕllā nārideri
māvaṁṭisavadula madim̐ dalasevā

(||||)
yegadamāḍedānavu iṁpu salledānavu
jogadoḍa nīvegā suṭṭamavu
segŏni nīginniḍānu sĕllubaḍi galigĕnu
dīgŏni nīdoḍivāridikku sūsevā

(||||)
kalisinadānavu kaṁduva nunna dānavu
ila nīvegā yidani iṁpudānavu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe mammĕlla nelĕ
nĕlavai nīsĕllĕṁḍla manniṁchaga mānevā