Gabbigolledala muddu ghanamaaya maagu nemdu

గబ్బిగొల్లెతల ముద్దు ఘనమాయ మాకు నేఁడు
Language

(॥పల్లవి॥)
గబ్బిగొల్లెతల ముద్దు ఘనమాయ మాకు నేఁడు
వుబ్బుచు నే చేఁతకైనా నూరకుండే బాలుని

(॥గబ్బి॥)
యెంగిలి తమ్ములమంటే నెవ్వతె ముద్దాడెనే
బంగారువంటిచెక్కుల పసిబాలుని
బొంగగార మోవితేనె సోఁ కించె నెవ్వతే
ముంగిటనిధానమై ముద్దుగారే బాలుని

(॥గబ్బి॥)
అండఁ జెమటచన్నుల నద్దు కొన్న దెవ్వతే
దండిగా నీరార్చిన తగుబాలుని
నిండుబూతు బండుం డిట్టు నేరిపిన దెవ్వతే
వొండేమి నెఱుఁగక వూరకుండే బాలుని

(॥గబ్బి॥)
కొప్పుపువ్వు మెడదండ గుచ్చి కట్టె నెవ్వతే
వొప్పుగ దేవరవలె నున్న బాలుని
తిప్పితిప్పి వీధులెల్లాఁ దిరిగించె నెవ్వతే
ముప్పిరి శ్రీవేంకటాద్రి మూలనున్నబాలుని

(||pallavi||)
gabbigŏllĕdala muddu ghanamāya māgu nem̐ḍu
vubbusu ne sem̐tagainā nūraguṁḍe bāluni

(||gabbi||)
yĕṁgili tammulamaṁṭe nĕvvadĕ muddāḍĕne
baṁgāruvaṁṭisĕkkula pasibāluni
bŏṁgagāra movidenĕ som̐ kiṁchĕ nĕvvade
muṁgiḍanidhānamai muddugāre bāluni

(||gabbi||)
aṁḍam̐ jĕmaḍasannula naddu kŏnna dĕvvade
daṁḍigā nīrārsina tagubāluni
niṁḍubūdu baṁḍuṁ ḍiṭṭu neribina dĕvvade
vŏṁḍemi nĕṟum̐gaga vūraguṁḍe bāluni

(||gabbi||)
kŏppubuvvu mĕḍadaṁḍa guchchi kaṭṭĕ nĕvvade
vŏppuga devaravalĕ nunna bāluni
tippidippi vīdhulĕllām̐ dirigiṁchĕ nĕvvade
muppiri śhrīveṁkaḍādri mūlanunnabāluni