గారవించవయ్యా యింతిఁ గాఁగిలించి
(॥పల్లవి॥)
గారవించవయ్యా యింతిఁ గాఁగిలించి
కోరికతో కొప్పుజారీ కొచ్చిచూచి నిన్నును
(॥గార॥)
నీకు మొక్కఁబూనితేను నెలఁత వేలిగోరు
రేకగాఁ జెక్కుమీఁదఁ జీరెను చేతప్పి
ఆకడ నీవు నవ్వితి వందుకుఁగా సిగ్గువడి
వాకుచ్చనేరక తలవంచుకున్న దెదుట
(॥గార॥)
నీతో మాఁటలాడరాఁగా నెలఁతపలు వొరసి
ఘాతగాఁ దనపెదవి గంటివడెను
యేతున నీవు మెచ్చితే నిందుకుఁగా సిగ్గువడి
కాతరాన నిన్నుఁజూచి కాఁతాళించీ నదివో
(॥గార॥)
నిన్నుఁగాఁగించఁగాను నెలఁతచనుఁగొండలు
తన్నుఁదానే తనచంకఁ దడఁబడితే
కన్నె శ్రీవేంకటేశుఁడ కంటివంటా సిగ్గువడి
పన్ని నిన్నుఁ బరాకుగా భ్రమయించీ నిపుడు
(||pallavi||)
gāraviṁchavayyā yiṁtim̐ gām̐giliṁchi
korigado kŏppujārī kŏchchisūsi ninnunu
(||gāra||)
nīgu mŏkkam̐būnidenu nĕlam̐ta veligoru
regagām̐ jĕkkumīm̐dam̐ jīrĕnu sedappi
āgaḍa nīvu navvidi vaṁdugum̐gā sigguvaḍi
vāguchchaneraga talavaṁchugunna dĕduḍa
(||gāra||)
nīdo mām̐ṭalāḍarām̐gā nĕlam̐tabalu vŏrasi
ghādagām̐ danabĕdavi gaṁṭivaḍĕnu
yeduna nīvu mĕchchide niṁdugum̐gā sigguvaḍi
kādarāna ninnum̐jūsi kām̐tāḽiṁchī nadivo
(||gāra||)
ninnum̐gām̐giṁcham̐gānu nĕlam̐tasanum̐gŏṁḍalu
tannum̐dāne tanasaṁkam̐ daḍam̐baḍide
kannĕ śhrīveṁkaḍeśhum̐ḍa kaṁṭivaṁṭā sigguvaḍi
panni ninnum̐ barāgugā bhramayiṁchī nibuḍu